Begin typing your search above and press return to search.

యాంటిలియాలో ముఖేష్ అంబానీ ఆ ఫ్లోరే ఎందుకు ఎంచుకున్నారు?

భారతదేశ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్ ముకేష్ అంబానీకి ముంబైలో యాంటిలియా అనే లగ్జరీ నివాసం ఉన్న సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   8 Oct 2024 1:30 AM GMT
యాంటిలియాలో ముఖేష్  అంబానీ ఆ ఫ్లోరే ఎందుకు ఎంచుకున్నారు?
X

భారతదేశ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్ ముకేష్ అంబానీకి ముంబైలో యాంటిలియా అనే లగ్జరీ నివాసం ఉన్న సంగతి తెలిసిందే! దీని నిర్మాణానికి అయిన ఖర్చు సుమారు రూ.15,000 కోట్లు అని అంటారు. దీని నిర్మాణం 2008లో ప్రారంభమై 2010లో ముగిసింది. ఇందులో 27 అంతస్తులు ఉంటాయి.

ఇదే సమయంలో సుమారు నాలుగు లక్షల అడుగుల మేర విస్తరించి ఉన్న ఈ యాంటిలియాలో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. ఈ 27 అంతస్తుల్లోనూ కొన్ని అంతస్తులు పూర్తిగా కార్ పార్కింగ్ కోసమే కేటాయించడం గమనార్హం. ఇక ఈ ఇంట్లో తొమ్మిది హైస్పీడ్ ఎలివేటర్లు ఏర్పాటు చేశారు! వీటీతో పాటు మూడు హెలీప్యాడ్ లనూ నిర్మించారు!

సుమారు 600 మంది ఉద్యోగులు పనిచేసే ఈ యాంటిలియాలో సిబ్బంది వసతికి వసతి కూడా ఏర్పాటు చేశారు! ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, స్పా, 50 సీట్ల థియేటర్, టెర్రస్ గార్డెన్, యోగా స్టూడియోతో పార్టు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా ఈ భవనాన్ని నిర్మించారు.

ఇన్ని సౌకర్యాలు, సదుపాయాలతో అత్యంత లగ్జరీగా ఉండే ఈ భవనంలో మొత్తం 27 అంతస్తులు ఉండగా... ఫ్యామిలీలోని సభ్యులు అంతా ఆ 27వ అంతస్తులోనే బస చేస్తారని అంటారు. ఎన్ని అంతస్తులు ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ మెంబర్స్ అంతా బస చేసేందుకు ఈ 27వ అంతస్తునే ఎంచుకున్నారు.

అవును... 27 అంతస్తులు ఉన్న యాంటిలియోలో ముకేష్ అంబానీ, నీతా అంబానీ, వారి ఇద్దరు పిల్లలు ఆకాశ్, అనంత్, ఇద్దరు కోడల్లు శ్లోకా మెహతా, రాధిక మర్చంట్ అంతా... బస చేసేందుకు ఈ అంతస్తునే ఎంచుకున్నారు. దానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని.. అందుకే వేర్వేరు ఫ్లాట్స్ లాంటి ఇళ్లు ఉన్న 27 అంతస్తునే ఎంచుకున్నారని అంటారు.

ఇందులో భాగంగా... ఈ ఫ్లోర్ లో గదులు చాలా విశాలంగా ఉంటాయని.. ప్రధానంగా ఈ ప్రదేశంలో ఏసీలు అవసరం లేకుండా సహజమైన ప్రకృతి గాలి ఉంటుందని.. వెంటిలేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని.. ఇదే క్రమంలో... భద్రతాపరంగా కూడా ఈ 27వ అంతస్తు అత్యంత సురక్షితమైనదని చెబుతారు. అందుకే ఫ్యామిలీ మొత్తం ఈ ఫ్లోర్ లోని ఉంటారని చెబుతారు!