అంబానీ చెఫ్ జీతం ఎంతో తెలిస్తే అదిరిపోవాల్సిందే!
ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు
By: Tupaki Desk | 6 Aug 2024 5:55 AM GMTప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల తన కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఏ స్థాయిలో జరిగిందో అంతా చూశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నంబర్ వన్ సెలబ్రిటీలుగా ఉన్నవారంతా అంబానీ ఇంట వాలిపోయారు. అంబానీ ఆతిథ్యం స్వీకరించి మురిసిపోయారు. అంబానీ ఆహ్వానం అందుకున్నవారిగా గర్వపడ్డారు. తన కుమారుడి వివాహానికి తక్కువలో తక్కువగా ముకేశ్ అంబానీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి.
మరి అలాంటి ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసేవారికి జీతాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసా? అంబానీ ఇంట్లో డ్రైవర్లుగా, వంటవాళ్లుగా, పనివాళ్లుగా పనిచేయాలంటే ఏ అర్హతలు ఉండాలి? వారిని అంబానీ కుటుంబం ఎలా చూసుకుంటుంది? పనివాళ్లకు జీతాలు ఎంత ఉంటాయి వంటి విషయాలు తెలుసుకుంటే నోరెళ్లబెట్టడం ఖాయం.
ముంబైలో విలాసవంతంగా, ఆకాశాన్ని అంటేలా ఉండే ఆంటిలియా (ముకేశ్ అంబానీ నివాసం పేరు)లో పనిచేసేవారి జీతాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబానీ ఇంట్లో పనివాళ్లకు భారీ జీతాలు దక్కుతున్నాయని తెలుస్తోంది.
అంబానీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఉన్నట్టే కార్పొరేట్ సౌకర్యాలు, వేతనాలు తమ ఇంట్లో పనివాళ్లకు కూడా ఇస్తున్నారని సమాచారం.
అంబానీ ఇంట్లో పనిచేయాలంటే కనీసం ఏదైనా డిప్లామా లేదా డిగ్రీ చేసి ఉండాలట. అంబానీ ఇల్లు ఆంటిలియాలో 500 మంది వరకు పనిచేస్తున్నారని తెలుస్తోంది. వీరందరికీ లక్షల్లోనే నెలకు జీతాలు ఉన్నాయని సమాచారం. డ్రైవర్ వేతనానికి సమానంగా వంట చేసేవారికి కూడా ఉండటం విశేషం.
అంబానీ ఇంట్లో చెఫ్ కు నెలకు రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తున్నారట. ఏడాదికి రూ.24 లక్షలు జీతం. అయితే అంబానీ ఇంట్లో పనికి కుదరడం అంత తేలిక కాదని తెలుస్తోంది. పనివాళ్లకు వివిధ రకాల పరీక్షలు పెడతారని తెలుస్తోంది. వాటిలో వాళ్లు ఉత్తీర్ణులై.. వారి వ్యవహార శైలి పట్ల అంబానీ కుటుంబం మొగ్గు చూపితేనే పని లభిస్తుంది.
ఒకసారి పనిలో పెట్టుకున్నాక వారిని పనివాళ్లుగా చూడరట. ఇంట్లో సభ్యులుగానే చూస్తారట. మర్యాదగా సంభాషించడం, గౌరవం ఇవ్వడం చేస్తారని తెలుస్తోంది.
తన ఇంట్లో పనిచేసే పనివాళ్లకు కేవలం జీతాలే కాకుండా వారికి పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, ఇతర అలవెన్సులను కూడా అంబానీ అందజేస్తున్నారని తెలుస్తోంది. ఏడాదికి కనీసం రూ.24 లక్షలకు తగ్గకుండా పనివాళ్ల శాలరీలు ఉన్నాయని సమాచారం.