అంబానీ ఇంట జరిగిన ‘‘లగన్ లఖ్ వనూ’’ వేడుక ఏంది?
రెండు అక్షరాల ‘పెళ్లి’ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూరతి తన పెళ్లి వేడుకను ఎంత సింఫుల్ గా చేసుకున్నారో తెలిసిందే.
By: Tupaki Desk | 17 Feb 2024 4:02 AM GMTరెండు అక్షరాల ‘పెళ్లి’ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూరతి తన పెళ్లి వేడుకను ఎంత సింఫుల్ గా చేసుకున్నారో తెలిసిందే. ఆమె కుమార్తె పెళ్లి వేడుకను చాలా పరిమితంగా నిర్వహించారు. అందుకు భిన్నంగా భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుకలు ఒక రేంజ్ లో సాగుతాయి. వారింట్లో పెళ్లిని నిర్వహించే విధానం మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది.
పక్కా సంప్రదాయాన్ని పాటించటమే కాదు పెళ్లి వేడుకలో భాగంగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తుంటారు. తాజాగా అలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. ‘లగన్ లఖ్ వనూ’ పేరుతో నిర్వహించిన వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుక లెక్కేంటి? దాన్ని ఎలా నిర్వహించారు? లాంటి అంశాల మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ జంట ఎంగేజ్ మెంట్ గతంలో ఎంత భారీగా.. మరెంత వైభవంగా నిర్వహించారో తెలుసిందే. తాజాగా నిర్వహించిన లగన్ లఖ్ వనూ పెళ్లికి ముందు నిర్వహించే కార్యక్రమంగా చెప్పాలి. ఈ వేడుకలో కాబోయే వధువు రాధిక సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఆమె ధరించిన దుస్తులపై ప్యాషన్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ జరగుతోంది. సందర్భానికి తగ్గట్లు సిద్ధం కావటం రాధిక మర్చంట్ కు అలవాటన్న పేరు ఆమె సొంతం.
పండగలు.. ప్రత్యేక పూజలు లాంటి వేళ సంప్రదాయ దుస్తులతో మెరిసిపోయే ఆమె.. పార్టీలు.. ఇతర అకేషన్లలో మోడ్రన్ వస్త్రధారణతో అందరి చూపు తన మీద పడేలా చేస్తారు. తాజాగా జరిగిన లగన్ లఖ్ వనూ వేడుక కోసం ఆమె ధరించిన డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేశారు. పేస్టల్ బ్లూ లెహెంగాతో ఫ్లోరల్ ఆప్లిక్ డిజైన్ తో తీర్చిదిద్దిన ఈ లెహంగాకు అటైర్ కు మ్యాచింగ్ బ్లౌజ్.. దుపట్టాలను జత చేయటం.. డైమండ్ జ్యూయలరీతో తళుక్కుమనేలా చేశారు. సింఫుల్ మేకప్ తో ఆకట్టుకున్న రాధికకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇంతకూ ఈ వేడుకను ఎందుకు నిర్వహించారు? ఆ లెక్కేంటి అన్న విషయంలోకి వెళితే.. మన పెళ్లిళ్లలో లగ్న పత్రిక రాసుకోవటం ఉంది చూశారు. అలాంటిదే గుజరాతీ సంప్రదాయంలో ఈ వేడుకగా చెప్పాలి. ఈ వేడుక తర్వాతే గుజరాతీయులు పెళ్లి పనులను మొదలుపెడతారు. సాధారణంగా పెళ్లికి నెల ముందు ఈ వేడుకను నిర్వహిస్తారు. రెండు కుటుంబాల పెద్దలంతా కలిసి లగ్నపత్రికను రాయించి.. దాన్ని దేవుడి సమక్షంలో ఉంచుతారు. తద్వారా భగవంతుడి ఆశీస్సులు అందించాలని కోరుకుంటారు.
గత ఏడాది జనవరిలోఅనంత్ - రాధిక ఎంగేజ్ మెంట్ జరగటం తెలిసిందే. ఈ వేడుకను భారీగా నిర్వహించారు. గోల్ ధానా పేరుతో అంబానీ నివాసమైన యాంటిలియా దీనికి వేదికైంది. గుజరాతీ సంప్రదాయం నిర్వహించే ముందస్తు పెళ్లి వేడుకల్లో ఛన్లో మట్లీ అనే వేడుక కూడా ఉంటుంది. ఇందులో వధువు తండ్రి వరుడి ఇంటికి చేరుకొని.. వరుడి నుదిటిన తిలకం దిద్ది కానుకలు అందిస్తారు. ఆ తర్వాత పెళ్లి పనులు జోరందుకుంటాయి. సో.. రానున్న రోజుల్లో మరెన్న వేడుకలు అంబానీ ఇంట పెళ్లికి ముందు జరగనున్నాయన్న మాట.