Begin typing your search above and press return to search.

కొడుకు పెళ్లికి 5000కోట్లు పెట్టి 25000 కోట్లు సంపాదించాడు!

కొత్త కోడలు అదృష్టం తెచ్చిపెట్టింది. రాధిక న‌ట్టింట అడుగుపెట్ట‌గానే ముఖేష్ అంబానీ ఆస్తి ఐశ్వ‌ర్యం పెరిగింది

By:  Tupaki Desk   |   21 July 2024 8:02 AM GMT
కొడుకు పెళ్లికి 5000కోట్లు పెట్టి 25000 కోట్లు సంపాదించాడు!
X

కొత్త కోడలు అదృష్టం తెచ్చిపెట్టింది. రాధిక న‌ట్టింట అడుగుపెట్ట‌గానే ముఖేష్ అంబానీ ఆస్తి ఐశ్వ‌ర్యం పెరిగింది. అంబానీ కేవ‌లం 10 రోజుల్లో 25000 కోట్లు సంపాదించాడు. వారు పెళ్లి పేరుతో 5000 కోట్లు త‌గ‌లేశారు! అని విమ‌ర్శించే ప‌రుల‌కు ఇది చెంప పెట్టు లాంటి స‌మాధానం.

కొన్ని నెల‌ల పాటు సాగించిన పెళ్లి సంబ‌రాల్లో భారీ ఈవెంట్ల‌తో పాటు సెల‌బ్రిటీ గ్లిజ్ చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షించాయి. గొప్ప స్టార్లతో ఈవెంట్ కోసం అంబానీ వంద‌ల కోట్లు ప్యాకేజీలు ముట్ట‌జెప్పాడు. తిండి ప‌దార్థాల కోసం విందు విహారాల‌ కోసమే వంద‌ల కోట్లు ఖ‌ర్చ‌యింది. యాక్సెస‌రీస్ కానుక‌లు అంటూ కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేసారు. అపార ధ‌న సంప‌దలోంచి కొంత శాతం ఖ‌ర్చు చేసారు.

అయితే ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. నిజానికి అంబానీల పెళ్లిని కేవ‌లం అన‌వ‌స‌ర‌మైన‌ ఖ‌ర్చుగానే చూడ‌కూడ‌ద‌ని, ఇది గొప్ప ఆదాయ మార్గ‌మ‌ని నిరూప‌ణ అయింది. అనంత్ అంబానీ- రాధిక మ‌ర్చంట్ ల పెళ్లి రోజున రిలయన్స్ షేర్లు 1 శాతం పెరిగాయి. గత నెలలో ఈ షేర్లు 6.65 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో అంబానీలు 14.90 శాతం రాబడిని సాధించారు. 12 జూలై 2024న రాధిక మర్చంట్‌తో తన కుమారుడు అనంత్ అంబానీ విలాసవంతమైన వివాహం జరిగిన తర్వాత భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ నికర విలువ గణనీయంగా పెరిగింది. పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఇది ఐదు రెట్లు పెరిగింది. ఆజ్ తక్ అందించిన వివ‌రాల‌ ప్రకారం... పెళ్లి తర్వాత కేవలం 10 రోజుల్లోనే అంబానీ నికర ఆస్తుల‌ విలువ రూ.25,000 కోట్లు (సుమారు 3 బిలియన్ డాల‌ర్లు) పెరిగింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నికర ఆస్తుల‌ విలువ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఈ సంఖ్య 121 బిలియన్ల డాల‌ర్ల‌కు పెరిగింది. అంటే 3బిలియ‌న్ డాల‌ర్లు అద‌నంగా యాడ‌య్యాయి. ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని మెరుగుప‌రిచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో 12వ స్థానం నుండి 11వ స్థానానికి ముఖేష్ అంబానీ చేరుకున్నారు. అతడు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు.

అంబానీ నికర ఆదాయ‌ విలువ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున రిలయన్స్ షేర్లు 1 శాతం పెర‌గగా... గత నెలలో షేర్లు 6.65 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో వారు 14.90 శాతం రాబడిని అందించారు. అయితే పెళ్లి తర్వాత మంగళవారం నాడు షేర్లు 1.11 శాతం స్వల్పంగా క్షీణించి రూ.3,159 వద్ద ట్రేడవుతున్నాయి.

ముఖేష్ అంబానీ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో చతురత వ‌ల్ల‌ రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన పనితీరు క‌న‌బ‌రుస్తూనే ఉంది. భారీ వ్యక్తిగత ఖర్చులు ఉన్నా అతడి సంపద పెరుగుతూనే ఉంది. అనంత్ -రాధికల వైభ‌వ‌మైన‌ వివాహం అంబానీ కుటుంబానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగత మైలురాయిని అందివ్వ‌డ‌మే కాకుండా గొప్ప‌ సంప‌ద‌కు కార‌ణ‌మైంది. ఈ పెళ్లి ప్రపంచంలోని ప్రముఖ బిలియనీర్‌లలో ఒకరిగా అతని స్థానాన్ని బలోపేతం చేసింది. ప్రపంచం ఇంకా అనంత్ అంబానీ పెళ్లి గురించి ముచ్చ‌టిస్తూనే ఉంది. చూస్తుండగానే ముఖేష్ అంబానీ వ్యూహాత్మక పెట్టుబడులతో త‌న స్థానాన్ని మ‌రింత‌గా బ‌లోపేతం చేసుకున్నారు.