Begin typing your search above and press return to search.

విదేశాల్లో అంబటి రాంబాబు 'బ్రో' స్టైలిష్ ఫోటో!

రాజకీయాల్లో ఎంత మంది నాయకులున్నా.. కొంతమంది నాయకులు మాత్రమే మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు..

By:  Tupaki Desk   |   20 Oct 2024 11:05 AM GMT
విదేశాల్లో అంబటి రాంబాబు బ్రో స్టైలిష్  ఫోటో!
X

రాజకీయాల్లో ఎంత మంది నాయకులున్నా.. కొంతమంది నాయకులు మాత్రమే మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు.. ఇక సోషల్ మీడియా సంగతైతే చెప్పనక్కరలేదు. వారి మాట తీరో.. వేషభాషలో.. కారణం ఇదని ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అంటుంటారు.

ఇక మరికొందరైతే తమదైన ప్రకటనలు, ప్రవర్తనలతో జనాల్లో ప్రాచుర్యం సంపాదించుకుంటారు. ఈ రెండు కోవల్లో దేనికి చెందుతారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒకరనే చెప్పాలి. ఎమ్మెల్యేగా, మంత్రిగా కంటే... "బ్రో" సినిమా క్రమంలో వచ్చిన వివాదం తర్వాత మరింత వైరల్ అయ్యారని చెప్పాలి.

సంక్రాంతి సంబరాల్లో "అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబు.." అనే పాటకు ప్రజలతో కలిసి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ వీ డియో నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అంబటి రాంబాబు డ్యాన్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ పుట్టుకొచ్చారనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో అంబటి స్టైలిష్ పిక్ ఒకటి వైరల్ గా మారింది.

అవును... ఎప్పుడూ సాధారణ లుక్ తో ఆచారమైన తెలుగు దుస్తుల్లో, సింపుల్ గా ఉన్నట్లు కనిపించే అంబటి రాంబాబు ఉన్నపలంగా స్టైలిష్ లుక్ లో కనిపించారు! యూరోపియన్ దేశంలో చల్లగా ఉన్న వాతావరణానికి తగ్గట్లు ఆ గెటప్ అనిపిస్తున్నా.. గతంలో ఎప్పుడూ చూడని లుక్ కావడంతో.. అంబటి పిక్ వైరల్ గా మారుతుంది.

కాగా... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి రాంబాబు.. టీడీపీ అభ్యర్థిపై 27,836 ఓట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.