Begin typing your search above and press return to search.

నాడు ఎన్టీఆర్, నేడు బన్నీ... సిట్యువేషన్స్ రిపీట్ అవుతున్నాయా?

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తాజాగా మాట్లాడుతూ.. పనిగట్టుకొని కొందరు ఈ సినిమాపై పోస్టింగులు చేస్తున్నారని అన్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 12:36 PM GMT
నాడు ఎన్టీఆర్, నేడు బన్నీ...  సిట్యువేషన్స్  రిపీట్  అవుతున్నాయా?
X

ఏపీలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలపై సోషల్ మీడియాలో పోస్టుల పేరు చెప్పి అక్రమ అరెస్టులు చేస్తున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీనిపై ప్రతీ జిల్లాలోను ఆ పార్టీ లీగల్ సపోర్ట్ సిస్టం ను ఏర్పాటు చేసింది. ఈ విషయాలపై రెగ్యులర్ గా మీడియాలో విషయాలు చెబుతూ, ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తున్నారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పుష్ప-2’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ. ఎన్టీఆర్ ప్రస్థావన తెరపైకి తెచ్చారు.

అవును... అల్లు అర్జున్ తాజా సంచలనం "పుష్ప-2" సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుందనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తాజాగా మాట్లాడుతూ.. పనిగట్టుకొని కొందరు ఈ సినిమాపై పోస్టింగులు చేస్తున్నారని అన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరని.. ఆతనొక ఇంటర్నేషనల్ స్టార్ అని.. ‘పుష్ప-2’ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని.. అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలని అనుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘పుష్ప-2’ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. తాను కూడా ఆ సినిమా చూడటానికి రెడీగా ఉన్నానని అంబటి తెలిపారు. ఈ సందర్భంగా.. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ అద్భుతంగా ఉందని చెప్పిన అంబటి.. ‘పుష్ప-2’ పై కొంతమందికి జెలసీగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, బన్నీ సినిమాలు అడ్డుకోవాలనుకోవడం అవివేకమన్నారు.

ఈ నేపథ్యంలో.. నాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలని చూసిందెవరనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు అడ్డుకోవాలని చూస్తున్నదెవరనే చర్చ నెట్టింట మొదలైందని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్ రియాక్షన్ ఎటువైపు నుంచైనా ఏమైనా ఉంటాయేమో వేచి చూడాలి.