అల్లు అర్జున్ "మన వాడు"... ఆసక్తికర చర్చకు అంబటి ఆజ్యం!
ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకు అడ్డు తగులుతున్నారు.. అరచేతిని అడ్డుపెట్టి వారి సినిమాలను ఆపలేరన్నట్లుగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Dec 2024 6:50 AM GMTఅల్లు అర్జున్ నటించిన మూవీ "పుష్ప-2" ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. విడుదలవ్వడానికి ముందు నుంచి ఈ సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ని వైసీపీ తరుపున ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందనే చర్చ తెరపైకి వచ్చింది!
అవును... గత కొన్ని రోజులుగా ఎటు చూసినా "పుష్ప-2" కు సంబంధించిన సందడే కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి మొదలైన ఈ సందడి.. గురువారం ఉదయం పీక్స్ కి చేరింది.. ఇక వీకెండ్స్ లో మరింత పీక్స్ కి చేరిందని అంటున్నారు. మరోపక్క ఈ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
"పుష్ప-2" సినిమా విడుదలకు ముందు నుంచీ రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకున్నారు.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకు అడ్డు తగులుతున్నారు.. అరచేతిని అడ్డుపెట్టి వారి సినిమాలను ఆపలేరన్నట్లుగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఇక 'పుష్ప-2' ప్రదర్శించ బడుతున్న కొన్ని థియేటర్ల వద్ద "మా కోసం నువ్వు వచ్చావు.. మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే" అంటూ జగన్ - బన్నీ ఫోటోలతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. దీంతో... "పుష్ప-2" సినిమా విషయంలో పలు చోట్ల అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు జగన్ ఫ్యాన్స్ కలిసి సందడి చేశారు.
ఆ సంగతి అలా ఉంటే... ఈ సినిమాపై ముందు నుంచీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నవారిలో వైసీపీ నుంచి ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నారు అంబటి రాంబాబు. తొలుత ఈ సినిమా గురించి మీడియా ముందు ఆసక్తికర కామెంట్లు చేసిన ఆయన.. సినిమా విడుదల సమయంలో.. "పుష్ప - 2 తెలుగు వారికి పేరు తేవాలి!" అంటూ డిసెంబర్ 4న ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఇక సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిందని పూర్తి స్థాయిలో ప్రచారం జరిగిన అనంతరం... "పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా.. కాదు.. వరల్డ్ ఫైరు" అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది. పుష్పను అంబటి భూజానికి ఎందుకు ఎత్తుకున్నారనే చర్చ బలంగా మొదలైంది.
అక్కడితో ఆగని అంబటి ఈ సారి మరింత ఓపెన్ అయిపోయారు! ఇందులో భాగంగా... "ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసినవాడు 'మనవాడు' కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది" అని అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. దీంతో... అంబటి రాంబాబు.. అల్లు అర్జున్ ను పూర్తిగా 'వైసీపీ వాడు' చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు నెటిజన్లు.
అయితే... అల్లు అర్జున్ ని అంబటి రాంబాబు "మన వాడు" అని అనడంపై ఒకరు 'సామాజికవర్గం' పరంగా అని అంటుంటే.. మరికొంతమంది 'తెలుగు వాడు' అనే పరంగా అని ఇంకొకరు అంటే... కాదు కాదు.. "వైసీపీ వ్యక్తి" అని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగమని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ సినిమా ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం కావడం గమనార్హం.