Begin typing your search above and press return to search.

జగన్ డైలాగ్ అంబటి రిపీట్.. పవన్ సొంత బుర్ర వాడాలంట!

ఈ సమయంలో పోలీసులకు వార్నింగులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో.. పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   11 Nov 2024 9:29 AM GMT
జగన్  డైలాగ్  అంబటి రిపీట్.. పవన్  సొంత బుర్ర వాడాలంట!
X

ప్రస్తుతం రాష్ట్రంలో పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలీసులకు వార్నింగులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో.. పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జగన్... పోలీసుల వ్యవహార శైలిపై ఫైర్ అయ్యారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ని దగ్గరుండి బయటకు తీస్తామని అన్నారు. సప్తసముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తామని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మైకుల ముందుకు వచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సుమోటోగా కేసుపెడతానంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ చెప్పిన విషయాన్నే నొక్కి చెబుతూ.. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు.

వేదికపై మాట్లాడుతూ చెప్పులు చూపించి, దారుణమైన వ్యాఖ్యలు చేసిన పవన్ పై సుమోటో కేసు పెట్టోచ్చని.. వైసీపీ నేతలపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలదందరిపైనా కేసులు పెట్టొచ్చని.. వారు చేసిన కొన్ని వ్యాఖ్యలైతే తాను ఉచ్చరించలేనని చెబుతూ.. విడదల రజనీపైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

వైసీపీ కార్యకర్తలను పోలీసులు మూడు నాలుగు రోజులు అక్రమంగా నిర్భందించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయిన అంబటి.. దీనిపై వైసీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్... ఏదో ఒక అంశంపై ఆవేశంగా మాట్లాడి, తర్వాత పది రోజులు కనిపించకుండా పోతారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కాస్త సొంత బుర్ర వాడాలని.. సొంత బుర్రతో ఆలోచించి మాట్లాడాలని.. 21 కి 21 సీట్లు గెలిచిన వ్యక్తి ఎలా బడితే అలా మాట్లాడకూడదని అంబటి వ్యాఖ్యానించారు.