Begin typing your search above and press return to search.

అలా చేస్తే గెలవమంటూ అంబటి సంచలనం

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఒక టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతూ ప్రెస్ మీటులో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే గెలుస్తామా అని హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 3:27 AM GMT
అలా చేస్తే గెలవమంటూ అంబటి సంచలనం
X

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ఒక టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతూ ప్రెస్ మీటులో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే గెలుస్తామా అని హాట్ కామెంట్స్ చేశారు. అంబటి వంటి వైసీపీ వీర విధేయుడు ఇలా అనేశారేంటి అన్న చర్చ సాగుతోంది.

ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు అన్న డౌట్లూ వస్తున్నాయి. దీంతో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ గా సామాజిక మాధ్యమాలలో అవుతున్నాయి. పని చేయకుండా ఊరికే ఉపన్యాసాలు స్తే టీవీలలో మాట్లాడితే గెలుపు గుర్రమెక్కగలమా అంటూ అంబటి వారు డౌటనుమానం వ్యక్తం చేసిన తరువాత వైసీపీలో ఉన్న వారికి తత్వం బోధపడిందా లేక అంబటికే వేదాంతం ఎక్కిందా అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే అంబటి తన గురించే ఉదాహరణలు ఇచ్చుకున్నారు తాను టీవీలలో బ్రహ్మండంగా మాట్లడుతాను అని అంటూ అది గెలుపునకు కుదురుతుందా అని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న సత్తెనపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే 28 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యానని చెప్పారు. దాంతో తనకు ఏమీ అర్ధం కాలేదని అన్నారు.

ఓటమి తరువాత రెండు రోజులు బయటకు కూడా రాలేదని అన్నారు అయితే ఆ తరువాతనే తనకు ధైర్యం వచ్చిందని ఎందుకంటే తన కంటే భారీ తేడాతో చాలా మంది ఓటమి పాలు అయ్యారని ఆయన చెప్పారు. కొందరు అయితే ఏకంగా యాభై వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారని అన్నారు. దాంతో తన దగ్గరకు వచ్చిన ఒక పెద్దాయన తానే టైట్ ఫైట్ ఇచ్చానని చెప్పడంతో తనకు విషయం అర్ధం అయింది అన్నారు అంబటి.

అయితే భారీ మార్జిన్ తో మిగిలిన వారు ఓటమి పాలు అయ్యారని అది చూస్తె వారి కన్నా తానే బెటర్ కదా అని తెలుసుకున్నాను అని అంబటి చెప్పారు. ఇక 2014లో తాను కేవలం 924 ఓట్ల తేడాతోనే ఓడాను అని అప్ప్పట్లో నిద్ర కూడా పట్టేది కాదని తన ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ స్టోరీని ఆయన వినిపించారు. అయితే 2024 ఎన్నికల్లో 28 వేల తేడాతో ఓడినా కూడా నిద్రపట్టిందని అన్నారు.

ఇవన్నీ చూసినవారు విన్న వారు వైసీపీలో ఓడిన వైసీపీ నేతల పరిస్థితి ఇదేనని అంటున్నారు. అయితే అంబటి రాంబాబు మాత్రం బయటపడ్డారని మిగిలిన వారు దాచుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ నేతలు పరిస్థితి ఇలాగే ఉందని అంటున్నారు.

ఇంతకీ అంబటి టీవీల్లో మీడియాలో లెక్చర్లు దంచే వారు ఎవరో చెప్పనే లేదని అంటున్నారు. వైసీపీలో టికెట్లు తెచ్చుకుని పుచ్చుకుని పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది ఇలాగే అయితే మాత్రం అంబటి చెప్పింది తప్పు అయితే కాదని అంటున్నారు. అంతే కాదు ఓటమికి కారణాలు కూడా ఆ పార్టీ వేరేగా వెతుక్కోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.