యువగళం అట్టర్ ప్లాప్: అంబటి
సత్తెనపల్లిలో యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అని, ఆ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేదేమీ లేదని విమర్శలు గుప్పించారు.
By: Tupaki Desk | 11 Aug 2023 5:05 PM GMTమంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సత్తెనపల్లిలో ప్రజలు ఓ ఆంబోతును గెలిపించారంటూ అంబటిని ఉద్దేశించి లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. పెదకూరపాడులో జరిగిన బహిరంగసభలో దివంగత నేత కోడెల శివ ప్రసాదరావుపై ప్రశంసలు కురిపించిన లోకేష్...అంబటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై మాట్లాడాల్సిన అంబటి...బ్రో సినిమా వివాదం రేపి రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే లోకేష్ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. సత్తెనపల్లిలో యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అని, ఆ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేదేమీ లేదని విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా అధికారంలోకి రాలేరని జోస్యం చెప్పారు. లోకేష్‌కు తెలుగే సరిగా రాదని, మంగళగిరిలో ఓటమి పాలయ్యాడన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి చూపించాలని లోకేష్ కు సవాల్ విసిరారు.
తన కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో ప్రచారానికి మాత్రమే వస్తారని, మిగతా కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్పారు. వచ్చే ఎన్నికలకు తన కుటుంబ సభ్యులు మళ్లీ వస్తారని, వేరే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరని చెప్పారు. వైఎస్ పేరును జగన్ చెడగొడుతున్నారన్న కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ పై అంబటి మండిపడ్డారు. వైఎస్ పేరును సీఎం జగన్ నిలబెట్టాని చెప్పారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్లే నైజం కన్నాదని, టీడీపీలో కూడ ఆయన ఎక్కువ రోజులు ఉండడని చెప్పారు.