'బ్రో'ని వెంటాడుతున్న అంబటి... రేణూదేశాయ్ పై ట్వీట్ వైరల్!
మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా రేణూదేశాయ్ కు సలహా ఇచ్చారు. "అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!" అంటూ ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 10 Aug 2023 2:57 PM GMTపవన్ కళ్యాణ్ నటించిన "బ్రో" సినిమాలోని "శ్యాంబాబు" పాత్రతో పుట్టిన వివాదం ఇప్పట్లో ఆగేలాగా కనపడట్లేదు. ఒకవైపు నుంచి ఒక మాట అంటే మరో వైపు నుంచి పది మాటలు వచ్చిపడుతున్నాయి. తాజాగా "బ్రో" వివాదంపై పవన్ రెండో మాజీ భార్య రేణు దేశాయ్ మాట్లాడిన మాటలను ఉద్దేశిస్తూ అంబటి స్పందించారు.
తాజాగా రేణూ దేశాయ్ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ కల్యాణ్ తనకు అన్యాయం చేసినా సమాజానికి న్యాయం చేస్తాడన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో "బ్రో" వివాదంపైనా స్పందించారు. దీంతో తాజాగా అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు.
అవును.. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా రేణూదేశాయ్ కు సలహా ఇచ్చారు. "అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది. అంబటి తగ్గడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
కాగా... పవన్ సినిమా వివాదం గురించి తనకు పెద్దగా తెలియదని.. కొందరు పవన్ పెళ్లిళ్లు, పిల్లల గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తానంటున్నారని ఆమె వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దయచేసి ఆ వివాదంలోకి తమను లాగకండి అంటూనే.. పవన్ చాలా నిజాయితీపరుడు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తనకు కచ్చితంగా ద్రోహం చేసినా... సమాజానికి మాత్రం మంచిచేస్తాడని.. ఆయనకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని.. అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలంటూ వేడుకొన్నారు. ఆ వీడియో పోస్ట్ అయిన అనంతరం అంబటి ఇలా స్పందించారు.