Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నుంచి "బ్రో" రావొచ్చు... అంబటి కీలక వ్యాఖ్యలు!

అయితే ఈ విషయాలపై అంబటి రాంబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు‌కాదని, అనివార్యమైన అరెస్టు అని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   9 Sep 2023 9:08 AM GMT
హైదరాబాద్ నుంచి బ్రో రావొచ్చు... అంబటి కీలక వ్యాఖ్యలు!
X

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పై జనసేన అధినేత స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తుందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దీంతో... పవన్ రియాక్షన్ పై ఆయన్ని "బ్రో" అని సంబోధించే ఏపీ మంత్రి అంబటి ఫైరయ్యారు!

అవును... చంద్రబాబు అరెస్ట్ ను జనసేన సంపూర్ణంగా ఖండిస్తుందని చెప్పిన పవన్ కల్యాణ్... ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి రాకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ పట్ల వ్యవహరించాల్సిన తీరు అది కాదంటూ తప్పుబట్టే ప్రయత్నం చేశారు.

అయితే ఈ విషయాలపై అంబటి రాంబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు‌కాదని, అనివార్యమైన అరెస్టు అని స్పష్టం చేశారు. ఎన్నో అక్రమాలూ చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేయకపోతే విజ్ఞులైన ప్రజలు, రాజ్యాంగం క్షమించవని తెలిపారు! ఇదే క్రమంలో అన్యాయంగా అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్‌ వత్తాసు పలకటం ఏంటని ప్రశ్నించిన అంబటి రాంబాబు... చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ఎవరికి ఆపద వచ్చినా ఒకరికొకరు పూలబొకేలు ఇచ్చుకుంటుంటారంటూ సెటైర్ వేశారు! ఇదే సమయంలో... చంద్రబాబు, పవన్ అవినీతి గోదావరిలో దిగాలనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదని అంబటి తెలిపారు.

ఇక టీడీపీ నేతల హౌస్ అరెస్టులపై పవన్ చేసిన వ్యాఖ్యలపైనా అంబటి స్పందించారు. రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై పవన్ కి ఏమైనా బాద ఉంటే... హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏపీకి రావొచ్చని, రోడ్లపైకి రావొచ్చని తెలిపారు! ఆయన మాత్రం షూటింగులు చేసుకుంటూ.. కార్యకర్తలను రోడ్లపైకి రమ్మంటారా అని ప్రశ్నించారు!

ఇదే క్రమంలో చంద్రబాబుని నంద్యాలలో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విధానం సరైంది కాకపోతే.. ఏది సరైన క్రమమో చెప్పాలని పవన్ ను అంబటి అడిగారు. ఇదే సమయంలో... అన్యాయం, అక్రమం, అవినీతి చేసినవారిని సపోర్ట్ చేస్తే నువ్వు కూడా అవినీతిపరుడువే అవుతావు పవన్... గుర్తు పెట్టుకో అంటూ అంబటి కాస్త ఘాటుగానే సూచించారు!