జనసేన ప్రజెంటింగ్ సందులో సంబరాల శ్యాంబాబు..!
సందులో సంబరాల శ్యాంబాబు అనే టైటిల్ ని కూడా పెడుతున్నట్లు వారు చెప్పడం విశేషం.
By: Tupaki Desk | 2 Aug 2023 12:42 PM GMTపవన్ కళ్యాణ్ బ్రో సినిమా పై నిజానికి ఆ సినిమా హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా వారియర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ క్లిక్ అయితే, తమకు క్రేజ్ పెరుగుతుందని, ఆఫర్లు క్యూ కడతాయి అని అనుకున్నారు. కానీ, వాళ్ల ఫ్యూచర్ పక్కన పెడితే, అందులో కేవలం జస్ట్ వన్ మినట్ కనపడితే శ్యాంబాబు పాత్ర మాత్రం బాగా ఫేమస్ అయ్యింది.
ఎంతలా ఉంటే, మూవీ విడుదలైన దగ్గర నుంచి కేవలం ఆ పాత్ర గురించి మాత్రమే చర్చ జరిగేంతలా. హీరో గురించి కానీ, హీరోయిన్ల గురించి కానీ, స్టోరీ గురించి కానీ కాకుండా, శ్యాంబాబు వేసిన డ్యాన్సుల గురించే చర్చ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఆ పాత్రను మంత్రి అంబటి రాయుడు ని ఉద్దేశించి డిజైన్ చేయడమే ఈ చర్చ కారణమైంది.
నిజానికి, మూవీ చూసినవాళ్లంతా చూసి నవ్వుకొని అక్కడితో వదిలేశారు. కానీ, అంబటి ప్రెస్ మీట్ పెట్టి మరీ, ఈ విషయాన్ని పెద్దది చేశారు. పవన్ పై తాను సినిమా తీస్తానని, దానికి 'తాళి – ఎగతాళి', 'నిత్య పెళ్లికొడుకు' లాంటి సినిమా పేర్లు పెడతామంటూ చెప్పాడు. అంతే, ఆయన రెస్పాండ్ అవ్వడం వల్ల ఇష్యూ మొదలైంది అనుకుంటే, పవన్ ని టార్గెట్ చేయడంతో విషయం మరింత ముదిరింది.
చివరకు జనసైనికులు రంగంలోకి దిగేదాకా రావడం గమనార్హం. పవన్ పై చెత్త టైటిళ్లతో సినిమా తీస్తాను అని ప్రకటించాడని , జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ జోలికి వస్తే ఊరుకోం అని హెచ్చరిస్తూనే, డైరెక్ట్ గా అంబటి పై సినిమా తీస్తామంటూ ప్రకటించడం గమనార్హం. సందులో సంబరాల శ్యాంబాబు అనే టైటిల్ ని కూడా పెడుతున్నట్లు వారు చెప్పడం విశేషం.
కాస్త ముందుకెళ్లి, సినిమా క్లాప్ కొట్టడం, ఆయన లాగా కనిపించేలా ఓ నటుడిని వెతకడం కూడా చేసేశారు. హీరోయిన్ ని కూడా వెతికే పనిలో ఉన్నామంటూ జనసైనికులు చెప్పడం విశేషం. వీరి తీరు చూస్తుంటే, ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడేలా కనపడుతోంది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యేంత వరకు ఈ వివాదానికి పులిస్టాప్ పడేలా కనపడటం లేదు.