కాపు కాపుతో పోయారు...రెడ్డితో సెట్ అవలేదా...!?
క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ జంపింగ్స్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు అని నెటిజన్లు అంటున్నారు
By: Tupaki Desk | 10 Jan 2024 4:41 PM GMTక్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ జంపింగ్స్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు అని నెటిజన్లు అంటున్నారు. ఏ పార్టీలోనైనా నాయకులు చేరిన తరువాత కనీసంగా కొన్నాళ్ళు అయినా ఉంటే కేవలం పది రోజుల వ్యవధిలో అంబటి రాయుడు వైసీపీలో చేరడం బయటకు రావడం జరిగిపోయింది.
ఇక ఆయన ఇంత త్వరగా ఎందుకు బయటకు వచ్చారు అంటే రకరకాల కామెంట్స్ వచ్చాయి. విపక్షాలు అయితే వైసీపీని వీడినందుకు అంబటి రాయుడుని అభినందిస్తూ తమదైన శైలిలో వైసీపీ మీద విమర్శలు చేశారు. ఆ తరువాత తాపీగా అంబటి రాయుడు తాను ప్రస్తుతం నేను క్రికెట్ ఒప్పందాల నేపథ్యంలో దుబాయ్ వెళుతున్నాను కాబట్టి రాజకీయ అనుబంధం తనకు ఉండకూడదనిపించి రాజీనామాను వైసీపీకి చేశాను అని చెప్పారు.
అదే నిజం అనుకునేలోగా మరో ట్విస్ట్ అంబటి రాయుడు నుంచి వచ్చింది. అదేంటి అంటే ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ ని కలవడం. దాంతో ఆయన జనసేనకు దగ్గర అవుతున్నారు అని ప్రచారం సాగింది. దానికి తగినట్లుగానే అంబటి రాయుడు ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. తన భావజాలానికి వైసీపీ భావజాలానికి కుదరదు అని అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను అని అన్నారు.
ఇక జనసేన అధినేత పవన్ ని కలవమని కొందరు తన శ్రేయోభిలాషులు సూచించడం వల్ల పవన్ ని కలిశాను అన్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు నచ్చాయని అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం
దుబాయ్ కి వెళుతున్నాను అని చెప్పారు. అంటే ఆ టూర్ నుంచి వచ్చాక జనసేన తరఫున ఆయన పనిచేస్తారు అని చెప్పారన్న మాట.
దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అంబటి రాయుడు వైసీపీలో చేరి ఉన్నదే పది రోజులు ఇంత తక్కువ టైం లో ఆయనకు వైసీపీ భావజాలం ఏమిటో అర్ధం అయిందా లేక తన భావజాలానికి వ్యతిరేకంగా ఉందని తెలిసిందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక జనసేన భావజాలం తనకు నచ్చింది అంటున్న అంబటి రాయుడు పవన్ ఐడియాలజీతో తనకు కుదిరాయని చెప్పడం మీదనే కామెంట్స్ పడుతున్నయి. ఎపుడూ నిలకడగా లేని పవన్ విధానమే అంబటి రాయుడుకి నచ్చవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా నిలకడ లేని రాజకీయం అనిపించుకుంటున్నారు అని అంటున్నారు.
మొత్తానికి అంబటి రాయుడుకి జనసేనలో ఏమి నచ్చింది, వైసీపీలో ఏమి నచ్చలేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన రాయుడు అక్కడ భావ సారూప్యత కలవడం వల్లనే ఆ పార్టీని ఎంచుకున్నారా అన్న చర్చ కూడా వస్తోందిట.
ఏది ఏమైనా రాజకీయాలలో ఎపుడూ స్థిరంగా ఉండాలి. నిలకడగా ముందుకు సాగాలి, అపుడే ప్రజల మన్ననలు పొందుతారు అని అంటున్నారు. మొత్తానికి అంబటి రాయుడు రాజకీయంగా తడబాటు పడుతున్నారా అన్నది మాత్రం నెటిజన్లలో ఒక చర్చకు తావిస్తోంది.