Begin typing your search above and press return to search.

టీడీపీపైన ఫస్ట్ టైం అంబటి రాయుడు అలా...!

ఆయనను యూట్యూబ్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా టీడీపీ మీద సెటైర్లు వేశారు. మీ క్రికెట్ రీ ఎంట్రీకి ఎంఎస్కే ప్రసాద్ కారణమా అన్న ప్రశ్నకు రాయుడు జవాబు టీడీపీకి తగిలేలా ఉంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:25 PM GMT
టీడీపీపైన ఫస్ట్ టైం అంబటి రాయుడు అలా...!
X

తెలుగుదేశం పార్టీని రాజకీయ నేతలు విమర్శిస్తూంటారు. వైసీపీ నేతలు అయితే అదే పనిగా చేస్తారు. అది రాజకీయ సమరంగానే అంతా చూస్తారు. మరి అంబటి రాయుడుకు రాజకీయ ఆసక్తి ఉంది కానీ ఆయన రాజకీయాల్లోకి ఇంకా ప్రవేశించలేదు. అయితే తన పొలిటికల్ రూటు ఏంటి అన్నది అంబటి రాయుడు ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చేశారు.

ఆయన వైసీపీని జగన్ని పొగుడుతూ వస్తున్నారు. అలాగే ఒకటి రెండు సార్లు జగన్ని కలసి వచ్చారు. వైసీపీ విధానాలు భేష్ అని అంటున్నారు. దాంతో అంబటి రాయుడు వైసీపీలోనే చేరుతారు అని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. ఇదిలా ఉంటే అంబటి రాయుడుని ఒక యూట్యూబ్ చానల్ వారు తాజాగా ఇంటర్వ్యూ చేశారు.

ఆయనను యూట్యూబ్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా టీడీపీ మీద సెటైర్లు వేశారు. మీ క్రికెట్ రీ ఎంట్రీకి ఎంఎస్కే ప్రసాద్ కారణమా అన్న ప్రశ్నకు రాయుడు జవాబు టీడీపీకి తగిలేలా ఉంది. నా ఎదుగుదల అంతా నా కెరీర్ అంతా కళ్ల ముందు ఉందని ఎవరో క్లెయిం చేసుకుంటే నేను ఎలా బాధ్యుడిని అంటూ అంబటి రాయుడు ప్రశ్నిస్తూనే తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే తన ఘనత అని టీడీపీ ప్రచారం చేసుకోవడం లాంటిది ఇది కూడా అని కామెంట్స్ చేశారు.

దాంతో అంబటి అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మీద సెటైర్లు వేయడం పట్ల చర్చ సాగుతోంది. ఆయన మనసులో మాటను ఈ విధంగా ఇండైరెక్ట్ గా చెప్పేశారా అని కూడా అంటున్నారు. ఇక తనకు జగన్ పొలిటికల్ ఫిలాసఫీ ఇష్టమని సూటిగానే చెప్పేశారు అంబటి. కులాలు మతాలు కాదు అందరూ బాగుండాలి అన్నది జగన్ ఫిలాసఫీ అని అదే తనకు నచ్చిందని అంబటి అంటున్నారు.

వైసీపీ సిద్ధాంతాల పట్ల తాను అందుకే ఆకర్షితుడిని అయ్యాను అని అంబటి అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన అంబటి రాయుడు తన బెర్త్ ని కంఫర్మ్ చేసుకునే క్రమంలో జగన్ని పొగుడుతూ టీడీపీ మీద జస్ట్ శాంపిల్ అన్నట్లుగా పొలిటికల్ సెటైర్ వదిలారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ కూడా ఈసారి కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. అంబటి రాయుడు ఒక సెలిబ్రిటీ. పైగా టీమిండియా మాజీ క్రికెటర్ గా మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్నవారు. ఆయన భారతదేశం తరపున అనేక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు.

అంబటి రాయుడు బ్యాటింగ్ అంటే యూత్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇలా అంబటి క్రికెట్ నుంచి రాజకీయ ఆటకు తయారు అవుతున్న నేపధ్యంలో టీడీపీని టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేశారు. మరి వైసీపీ ఆయనను రాజకీయంగా ముందుకు నడిపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.