Begin typing your search above and press return to search.

కొత్త మాట... “పైన అమ్మవారు - కింద అంబేడ్కర్”!

ఇప్పుడు ఆ సంపదను విజయవాడ నడిబొడ్డున దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని చాటిచెప్పేలా జగన్ సర్కార్ నిర్మించింది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 10:50 AM GMT
కొత్త మాట... “పైన అమ్మవారు - కింద  అంబేడ్కర్”!
X

విజయవాడ పరివర్తన చెందుతుంది.. సరికొత్త ఆకర్షణను సంపాదించుకుటుంది.. ఇప్పుడు నగరం నడిబొడ్డున 206 అడుగుల ఎత్తులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించబడింది. విజయవాడ నగర కేంద్రంలోని స్వరాజ్య మైదాన్‌ లోని ప్రధాన ప్రదేశంలో ఈ విగ్రహం 81 అడుగుల పీఠంపై ఉంచబడింది.

అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత అని మాత్రమే భావించేవారు ఎంతోమంది ఉన్న ఈ సమాజంలో... విద్యావేత్త, సామాజిక విప్లవకారుడు, జీనియస్, 64 భాషల్లో నిష్ణాతుడు, విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయడు, వెనుకబడిన వర్గాల నుంచి తొలి న్యాయవాది అనేది చాలా తక్కువమందికి తెలిసి ఉంటుండి. అంబేద్కర్ భారత జాతి సంపద!!

ఇప్పుడు ఆ సంపదను విజయవాడ నడిబొడ్డున దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని చాటిచెప్పేలా జగన్ సర్కార్ నిర్మించింది. "స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్" ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం అవుతున్న విషయం. నేడు ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అంబేద్కర్ అభిమానులు బెజవాడకు చేరుకున్నారు.

విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా రూపుదిద్దుకున్న ఈ అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం... ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ ఉన్నది అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాదు. మూడు అంతస్థులలో ఆ మహానుభావుడికి చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, మరెన్నో విశేషాలు అందులో ఉన్నాయి.

206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్‌ జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు, అజ్ఞాన పీడితులకు తప్ప.. సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుందనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా నెటిజన్లు... ఇక నుంచి విజయవాడ అంటే... "పైన అమ్మవారు, కింద అంబేద్కర్" అంతే అని కామెంట్ చేస్తున్నారు.