Begin typing your search above and press return to search.

కెనడా పద్దతి మారలేదు.. తెరపైకి మరో రగడ.. అమెరికా ఎంట్రీ!

తాజాగా కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ 2025-26 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన "జాతీయ సైబర్ ముప్పు" నివేదికలో ఈ విషయాలను ప్రస్థావించింది.

By:  Tupaki Desk   |   3 Nov 2024 3:50 AM GMT
కెనడా పద్దతి మారలేదు.. తెరపైకి  మరో రగడ.. అమెరికా ఎంట్రీ!
X

ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పతనావస్తకు చేరిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చింది.

దీంతో... ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో... సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెంటనే వెనక్కి రప్పించింది. ఇదే సమయంలో... భారత్ లోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. దీనికితోడు ఇటీవల సైబర్ గూఢచర్యానికి పాల్పడే దేశాల జాబితాలో భారత్ ను చేర్చేందుకు ప్రయత్నించింది కెనడా.

తమకు ముప్పుగా భావించే దేశాల నివేదికలో భారతదేశం పేరును ప్రస్తావించింది. ఇదే సమయంలో... ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాతో భారత్ ను పోలుస్తూ తీవ్ర ఆరోపణలూ చేసింది. తాజాగా కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ 2025-26 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన "జాతీయ సైబర్ ముప్పు" నివేదికలో ఈ విషయాలను ప్రస్థావించింది.

ఇలా గత కొంతకాలంగా భారత్ పై పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది కెనడా. దీంతో.. కెనడా ప్రధాని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోణంలోనే ఆలోచిస్తూ.. భారత్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో తాజాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కెనడా దేశ మంత్రి ఒకరు అసంబద్ధ ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా... కెనడాలోని ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడుల వెనుక భారత పాత్ర ఉందంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు. దీంతో... కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి మరీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. ఆ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది.

ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై కెనడా అధికారికి సమన్లు జారీ చేశామని.. ఇటీవల అట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు అమిత్ షా పై కెనడా డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ నిరాధారమైన ఆరోపణలు చేశారని.. ఇవి పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవని భారత్ ఖండించింది.

ఈ నేపథ్యంలో కెనడా డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇందులో భాగంగా... ఈ ఆరోపణలు ఆందోళనకరమైనవని, దీనిపై కెనడా ప్రభుత్వంతో తాము సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది.