అమెరికా ఉపాధ్యక్షుడు.. ఏపీకి అల్లుడే!
ఇక, జేడీ వాన్స్ విషయానికి వస్తే.. ఈయన తెలుగు వారి ఇంటల్లుడు. పైగా ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరు గ్రామానికి చెందిన ఉషా చిలుకూరి భర్త.
By: Tupaki Desk | 6 Nov 2024 12:04 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయతీరాలను చేరు కున్నారు. ఇక, ఆయన గెలుపుగుర్రం ఎక్కినట్టు ప్రకటనే మిగిలి ఉంది. ఇక, ఈయనతోపాటు.. ఎంచుకు న్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కూడా విజయం దక్కించుకున్నట్టు అయింది. సహజంగా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న నాయకులు విజయం సాధిస్తే.. ఉపాధ్యక్షుడు కూడా విజయం దక్కించుకున్నట్టేనని అమెరికా రాజ్యాంగం పేర్కొంటోంది.
ఈ క్రమంలో జేడీ వాన్స్ కూడా విజయం దక్కించుకున్నట్టే అయింది. ఇక, జేడీ వాన్స్ విషయానికి వస్తే.. ఈయన తెలుగు వారి ఇంటల్లుడు. పైగా ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరు గ్రామానికి చెందిన ఉషా చిలుకూరి భర్త. దీంతో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కానున్నారు. విజయోత్సవ ప్రసంగంలోనూ ట్రంప్.. వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. ఇది తెలుగు వారికి గర్వకారణమని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.
వాన్స్ ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్ విజయం సాధిస్తున్న నేపథ్యంలో దీనిని పురస్కరించుకుని.. అర్ధరాత్రి సమయంలో పెద్ద అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వాన్స్‌ను ట్రంప్ కొనియాడారు. రిపబ్లికన్స్ విజయం వెనుక ఉష చిలుకూరి కృషి ఉందన్నారు. అంతేకాదు.. వాన్స్‌ను ఉష ముందుండి నడిపించారని కూడా ట్రంప్ కొనియాడారు. ఇక, వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా చరిత్రలో ఈ విజయం చిరస్మరణీయమని, చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.
దేశంలో ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు. ఆర్థికంగా, దౌత్య పరంగా, విధానాల పరంగా కూడా అమెరికా చాలా కష్టాల్లో ఉందన్న వాన్స్.. దీనిని చక్కదిద్దేందుకు ట్రంప్ వంటి నాయకుడు మనకు అవసరం ఉందని అమెరికన్లు తీర్మానం చేసిన విజయంగా పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాట పడుతుందని కరతాళ ధ్వనుల మధ్య పేర్కొన్నారు.