Begin typing your search above and press return to search.

అమెరికా విద్య: కన్సల్టెన్సీ వద్దు.. టోల్ ఫ్రీ ముద్దు!

అవును... అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు కన్సల్టెన్సీలపై ఆధారపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:22 AM GMT
అమెరికా విద్య: కన్సల్టెన్సీ వద్దు.. టోల్ ఫ్రీ ముద్దు!
X

అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు కన్సల్టెన్సీలపై ఆధారపడాతారని అంటుంటారు. వీటిలో కొన్ని కన్సల్టెన్సీలు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుంటుంటే.. మరికొన్ని మాత్రం ఇక్కడ ఫ్లైట్ ఎక్కించేవరకే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయని చెబుతుంటారు. ఈ క్రమంలో అసలు కన్సల్టెన్సీల అవసరమే లేదని అంటున్నారు.

అవును... అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు కన్సల్టెన్సీలపై ఆధారపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు హైదరాబాద్‌ లో తాత్కాలిక యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌, వీసా అధికారి రెబెఖా డ్రేమ్‌! కన్సల్టెన్సీలను మించి కంప్లీట్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చే ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయని ఆమె తెలిపారు. యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఫెయిర్ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు అవగాహన కల్పించడానికి యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ హైటెక్స్‌ లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ లో ఆమె పాల్గొన్నారు! ఇందులో భాగంగా... 40 వర్సిటీల ప్రతినిధులతో నేరుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు.

అనంతరం విద్యార్థులను, వారి తల్లి తండ్రులను ఉద్దేశించి మాట్లాడిన రెబెఖా... విద్యార్థులకు సలహాలు ఇచ్చేందుకు హైదరాబాద్‌ కాన్సులేట్‌ సహా దేశవ్యాప్తంగా యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌(యూ.ఎస్‌.ఐ.ఈ.ఎఫ్‌.) కేంద్రాలు ఉన్నాయని.. అక్కడనుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

ఇదే సమయంలో సందేహాల నివృత్తికి టోల్‌ ఫ్రీ నంబరు (1800 1031231) కూడా ఉందని తెలిపిన రెబఖా... ఫేస్‌ బుక్‌ లో "ఎడ్యుకేషన్‌ యూఎస్‌ ఇండియా"ను ఫాలో కావొచ్చని తెలిపారు. ఇదే క్రమంలో... అధికారిక వెబ్‌ సైట్‌ ల నుంచి సమాచారం పొందాలని సూచించారు.

మరోపక్క ఇటీవల 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఒకేసారి 21మంది విద్యార్థులు అమెరికాలో దిగిన అనంతరం రిటన్ ఫ్లైట్ ఎక్కించేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై కూడా రెబెఖా స్పందించారు. ఈ సమయంలో ఆ విద్యార్థుల వ్యక్తిగత వివరాలను మాత్రం చెప్పలేమని అన్నారు.

ఇదే సమయంలో... విద్యార్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లనూ వెంట ఉంచుకోవాలని.. అదేవిధంగా నిజాయతీగా వ్యవహరించాలని ఆమె తెలిపారు. ఒకవేళ అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత కూడా అనుమానం వస్తే ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీ చేస్తారనే విషయం గుర్తుంచుకుని అందుకు అన్ని రకాలుగానూ సిద్ధంగా ఉండాలని తెలిపారు.