Begin typing your search above and press return to search.

అమెరికాలో వరదొస్తే... ఆఫ్రికాకు ఎంత కలిసొస్తుందో తెలుసా?

అవును... అమెరికాలో వరదలొస్తే ఆఫ్రికాకు బాగా కలిసి వస్తుంది. దానికి కారణం కార్ల వ్యాపారం. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం.

By:  Tupaki Desk   |   4 Oct 2023 1:30 AM GMT
అమెరికాలో వరదొస్తే... ఆఫ్రికాకు ఎంత కలిసొస్తుందో తెలుసా?
X

వానొచ్చెనంటే వరదొస్తది.. వరదొచ్చెనంటే బురదొస్తది.. బురదలో దొర్లితే దురదొస్తది.. అనేది పాత మాట.! అమెరికాలో వానొచ్చెనంటే వరదొస్తది.. అక్కడ వరదొచ్చెనంటే ఆఫ్రికాకు బాగా కలిసొస్తది అనేది కొత్త మాట.! ఇదేదో ప్రాస కోసం వాడుతున్న మాట.. యతికోసం రాస్తున్న మాటో కాదు సుమా... ఇది అక్షరాలా నిజం.. అమెరికా కార్ల మీద ఒట్టు!

అవును... అమెరికాలో వరదలొస్తే ఆఫ్రికాకు బాగా కలిసి వస్తుంది. దానికి కారణం కార్ల వ్యాపారం. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం. బెంజ్, బీ.ఎం.డబ్ల్యూ, ఆడీ, జాగ్వార్, ఫోర్డ్, హ్యూండాయ్, లూంబెర్గనీ... కంపెనీతో సంబంధం లేదు, మోడల్ తో అసలు సంబంధం లేదు... వరదలో తడిసిందా, ఆఫ్రికాకు తరలించాల్సిందే..!

ఇలా చూపించీ చూపించనట్లు, వినిపించీ వినిపించనట్లు, కనిపించీ కనిపించనట్లు చెప్పుకోవడం ఎందుకు కానీ... డైరెక్ట్ గా మేటర్ లోకి వెళ్లిపోదాం! ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలు వరదలో నిండిపోతున్న సంగతి తెలిసిందే. ఇక అగ్రరాజ్యం ఆర్ధిక రాజధాని న్యూయార్క్ సిటీ రోడ్లయితే నదీపాయలను తలపిస్తున్నాయి.

దీంతో నగర వాసులు ఇళ్లల్లోంచి మరీ అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఆ సంగతి అలా ఉంటే... ఈ వరద నీటిలో వీదుల్లో ఉన్న కార్లు, పార్కిం స్థలాల్లో ఉన్న వాహనాలు అన్నీ నీట మునిగిన సంగతి తెలిసిందే. ఇలా నీటిలో మునిగి, ఇంజిన్ తడిచిన వాహనాలను అమెరికన్లు తిరిగి వాడరు!

అవును... ఒకసారి వరద నీళ్లలో ఇంజిన్‌ తడిస్తే.. ఆ కారును అమెరికాలో ఎవరూ ముట్టుకోరట. సాధారణంగా లక్షన్నర డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉండే లగ్జరీ కార్లను సైతం వారు లైట్ తీసుకుంటారంట. ఇదే సమయంలో ఎంత ఖరీదైన కారైనా... దాని ఇంజిన్ ఒక్కసారి వరద నీటిలో తడిస్తే... దాని ధర అమాంత పడిపోతుందంట.

అది కూడా అత్యంత దారుణంగా... ఉదాహరణకు లక్షన్నర డాలర్లు ఉన్న లగ్జరీ కారు ఇంజిన్ వరదనీటిలో మునిగి నానిపోతే దాని ధర 5వేల డాలర్లకు పడిపోతుందంట. దీంతో... ఇలాంటి కార్లన్నింటిని ఓనర్లు ఇన్సూరెన్స్‌ వాళ్లకు అప్పగించేసి కొత్త కార్లను తీసుకుంటారట. ఈ క్రమంలో అది ఎంత ఖరీదైన కారైనా చాలా తక్కువ ధరకు జంక్‌ యార్డ్‌ లు లేదా వెహికల్ రీబిల్డర్‌ లకు వేలంలో విక్రయిస్తారట.

ఈ క్రమంలో ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన రీసెల్లర్ కంపెనీలు.. ఆ కార్లను.. కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. వరదలో నానడం వల్ల డ్యామేజ్ అయిన ఇంటీరియర్, సీట్ కవర్స్, మేట్ లను చైనా మెటీరియల్ తో కవర్ చేస్తారంట. అలా ఆల్ మోస్ట్ ఎఫ్.ఆర్. వెహికల్స్ గా కలరింగ్ ఇచ్చి ఆఫ్రికా దేశాలకు తరలించి సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు విక్రయిస్తారని తెలుస్తోంది.

ఇలా సుమారు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల డాలర్లు విలువ చేసే కార్లను సుమారు 45 నుంచి 50 వేళ డాలర్లకు దొరికే సరికే ఆయా దేశాల్లోని కార్ల ప్రియులు ఎగబడి కోంటారట. ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పనిచేస్తాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... తక్కువ ధరలో కోరుకున్న కారు కావాలనుకునే వారికి మాత్రం ఇది సువర్ణావకాశమే!

ఇలా అమెరికాలో వరద వస్తే ఆఫ్రికా దేశాల్లో... ముఖ్యంగా కెన్యా, నైగర్‌, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున ఈ కార్లను దిగుమతి చేసుకుంటున్నాయని అంటున్నారు. కాసింత ఖర్చు పెట్టి కొత్తగా తీర్చిదిద్దుతున్నాయట. దీంతో... ఆర్ధికంగా వెనుకబడిన ఆదేశాల్లోని వ్యక్తులు 40వేళ డాలర్లకే లోంబెర్గనీ లో తిరుగుతారన్నమాట.

ఈ బంపరాఫర్ ఏదో బాగానే ఉంది కదా.. మరి మనకు ఆ ఛాన్స్ లేదా అని అంటారా? ఇలాంటి కార్యక్రమాలకు భారత్ అంగీకరించడం లేదని తెలుస్తుంది. అయినా... నేరుగా టెస్లా కార్ల తయారీ యూనిట్ వంటివి ఇండియాలో ఉంటుంటే ఇలాంటి వరద, బురద కార్లు మనకెందుకబ్బా... అని సరిపెట్టుకోవడమే!!