Begin typing your search above and press return to search.

న్యూఢిల్లీ విమానం రోమ్ కు మళ్లింపు.. అంతా భయపడ్డారు.. ఏమైంది?

న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి బయలుదేరిన విమానం ఢిల్లీకి వచ్చే బదులు ఆదివారం సాయంత్రం రోమ్ కు వెళ్లింది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 6:44 AM GMT
న్యూఢిల్లీ విమానం రోమ్  కు మళ్లింపు.. అంతా భయపడ్డారు.. ఏమైంది?
X

అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన న్యూయార్క్ - న్యూఢిల్లీ విమానాన్ని రోమ్ కు మళ్లించారు. న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి బయలుదేరిన విమానం ఢిల్లీకి వచ్చే బదులు ఆదివారం సాయంత్రం రోమ్ కు వెళ్లింది. దీంతో.. అంతా భయపడ్డారని అంటున్నారు. కారణం.. బాంబు బెదిరింపు!

అవును... భద్రతా సమస్య తలెత్తడంతో శనివారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఇటలీలోని రోమ్ కు మళ్లించారని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.ఏ.ఏ) ధృవీకరించింది. ఈ సందర్భంగా... విమానం రోమ్ లో సేఫ్ ల్యాండింగ్ అయ్యిందని.. తర్వాత తిరిగి బయలుదేరడానికి అనుమతి లభించిందని తెలిపింది.

అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రకారం... లియోనార్డో డా విస్నీ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయ్యింది. అధికారుల తనిఖీ అనంతరం అక్కడ నుంచి తిరిగి బయలుదేరడానికి అనుమతి లభించింది. అయితే.. ఈ భద్రతా ముప్పుకు కారణాన్ని ఎయిర్ లైన్స్ పేర్కొననప్పటికీ.. ప్రోటోకాల్ కారణంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ముందు విమనానాన్ని తనిఖీ చేయడం అవసరమని పేర్కొంది.

ఈ సందర్భంగా విమానం ఎస్కార్ట్ అవుతున్న దృశ్యాలను పంచుకుంటూ స్పందించిన ఇటాలియన్ వైమానిక దళం... రెండు యూరోఫైటర్ విమానాలు ఢిల్లీకి వెళ్తున్న ప్రయాణికుల విమానాన్ని గుర్తించి ఎస్కార్ట్ చేయడానికి హుటాహుటిన బయలుదేరాయి.. ఆ విమానంలో అనుమానిత పేలుడు పరికరం ఉన్నట్లు సమాచారం అందడంతో ఫియుమిసినో ఎయిర్ పోర్ట్ వైపు తిరిగింది అని పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన ప్రయాణికులు... ఢిల్లీలో ల్యాండ్ కావడానికి మూడు గంటల ముందు విమాన మళ్లింపు ప్రకటన జరిగిందని.. దీంతో అంతా ఒక్కసారిగా భయపడ్డారని.. అనంతరం అంతా నిశబ్ధంగా ఉండి ఆదేశాలను పాటిస్తున్నారని.. ఫైటర్ జెట్ లు దగ్గరగా ఉన్నప్పుడు ఎవరూ అటు ఇటు తిరగొద్దని వారు కోరారని తెలిపారు.