Begin typing your search above and press return to search.

భారతీయుడిపై బలుపు వ్యాఖ్యలు... అమెరికా మహిళపై ఎయిర్ లైన్స్ సంచలన నిర్ణయం!

అవును... భారతీయ-అమెరికన్ ఫోటో గ్రాఫర్ పర్వేజ్ తౌఫిక్ పై ఓ అమెరికన్ మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   4 Dec 2024 9:12 AM GMT
భారతీయుడిపై బలుపు వ్యాఖ్యలు... అమెరికా మహిళపై ఎయిర్  లైన్స్  సంచలన నిర్ణయం!
X

అమెరికాలో భారతీయ-అమెరికన్ ఫోటో గ్రాఫర్ పర్వేజ్ తౌఫిక్ పై ఓ అమెరికన్ మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భారతీయులపై దుర్భాషలాడింది! ఈ దీనికి సంబంధించిన ఘటనను తౌఫిక్ వీడియో తీశారు. నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ సమయంలో అమెరికా ఎయిర్ లైన్స్ ఆ మహిళ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

అవును... భారతీయ-అమెరికన్ ఫోటో గ్రాఫర్ పర్వేజ్ తౌఫిక్ పై ఓ అమెరికన్ మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. 'థాంక్స్ గివింగ్' కోసం తౌఫిక్ తన పిల్లలతో కలిసి కాంకున్ నుంచి లాస్ ఏంజెలిస్ కు వెళ్తుండగా యునైటెడ్ ఎయిర్ లైన్స్ షటిల్ బస్సులో ఈ ఘటన జరిగింది. కరెన్ అనే మహిళ తప్పుడు వ్యాఖ్యలు చేసింది!

ఇందులో భాగంగా తౌఫిక్.. ఆమెతో తొలుత ఇంటరాక్ట్ అవ్వగా.. ఆమె అతని కుటుంబం పట్ల నీచమైన జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. తౌఫిక్ పిల్లలతో ఆమె 'నోరు మూయండి' అని అనడంతో పాటు.. 'మీ కుటుంబం భారతదేశానికి చెందినది.. మీకు నిబంధనలపై గౌరవం లేదు.. భారతీయులు వెర్రివాళ్లు!' అంటూ వాగింది!

దీనిపై స్పందించిన తౌఫిక్... పిల్లలను నోరు మూయమని చెప్పడం చాలా దారుణమని.. తన పిల్లలతో అలా మాట్లాడే హక్కు మీకు లేదని అన్నారు. అక్కడితో ఆగని ఆమె.. మీరు అందరినీ నెట్టాలని అనుకుంటారు.. పుష్, పుష్, పుష్.. అదే మీరు కోరుకుంటారు.. మీరు ఇంకా పిచ్చిగా నడుస్తున్నారని అనుకుంటున్నారు.. మీరు పిచ్చి వాళ్లు అని మాట్లాడింది.

ఈ సమయంలో చేతిలోని మధ్య వేలు చూపిస్తూ.. అసభ్యకరమైన సంజ్ఞలు చేసింది. ఈ సందర్భంగా తౌఫిక్ రికార్డ్ చేయడం ప్రారంభించగానే.. ఆ స్త్రీ మరింత రెచ్చిపోయింది. తన సొతం ఫొన్ ని తీసి అతన్ని వెక్కిరించింది. ఈ సందర్భంగా న్యూయార్క్ పోస్ట్ తో మాట్లాడుతూ.. ఈ సమయంలో ఆమె ఫుల్ గా తాగి ఉందని అన్నారు!!

ఈ సమయంలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సమయంలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... షటిల్ బస్సులో ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, భారతీయ-అమెరికన్ కుటుంబంపై జాతహంకార దాడిని ప్రారంభించిన తర్వాత ఆమెను నో ఫ్లై లిస్ట్ లో చేర్చింది!