అమెరికాలో ఎన్ఆర్ఐ భారీ స్కాం.. ఎన్ని కోట్లు కొట్టేశాడో తెలుసా?
ఫ్లొరిడాలోని లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన అతగాడి సంపాదనపై అధికారులు నిఘా పెట్టారు. కూపీ లాగగా అసలు విషయం బయటపడింది
By: Tupaki Desk | 9 Dec 2023 11:52 AM GMTప్రవాస భారతీయుడి (ఎన్ఆర్ఐ) స్కాంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మంచి మంచి స్కీంలు అమలు చేసుకుంటూ స్కాంలకు దూరంగా ఉండే అమెరికాకు ప్రవాస భారతీయుడు జలక్ ఇచ్చాడు అని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల ప్రకారం కోట్లాది రూపాయలను తన్నుకుపోయాడు. ఆలస్యంగా ఈ విషయం బయట పడడంతో అమెరికా అధికారులు విస్తుపోయారు. అతగాడు చేసిన నిర్వాకానికి ప్రవాస భారతీయులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో నివసించే భారత సంతతికి చెందిన అమిత్ పటేల్. ఆ దేశానికి చెందిన ఫుట్ బాల్ జట్టు ‘జాక్సన్ విల్లే జాగ్వార్స్’కు ఎగ్జిక్యూటివివ్ గా నియమితుడయ్యాడు. జట్టు ఆలనా పాలనా ఆయన చూసేవారు. ఫుట్ బాల్ జట్టుకు అవసరమయ్యే పనులను దగ్గరుండి చూసుకునేవాడు. దీంతో అతడిపై నమ్మకంతో మరిన్ని బాధ్యతలను అతనికి అప్పగించారు అధికారులు. దీనినే అవకాశంగా తీసుకున్న అమిత్ జట్టుకు సంబంధించి 22 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 183 కోట్లు) కొల్లగొట్టాడు అని ఆరోపిస్తున్నారు.
ఫ్లొరిడాలోని లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన అతగాడి సంపాదనపై అధికారులు నిఘా పెట్టారు. కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. జాక్సన్ విల్లే జాగ్వార్ జట్టు అవసరాల కోసం అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన డబ్బును మెల్ల మెల్లగా దారి మళ్లించాడు. లగ్జరీ విల్లాలతో పాటు టెస్లా కారు.. కొన్ని విలువైన వాచ్ లు.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో పాటు జిల్సాల కోసం, విలాసాలు తీర్చుకునేందుకు ఫ్రెండ్స్ తో కలిసి చార్టెడ్ ఫ్లయిట్ లలో విహార యాత్రలు చేసేవాడు. తన సంపాదనకు మించి ఖర్చు చేస్తుండడంతో అనుమానం వచ్చిన అధికారులు దర్యాప్తు చేయగా ఆయన కొల్లగొట్టిన రూ. 183 కోట్లు బయటపడ్డాయి అని అంటున్నారు. దీంతో వెంటనే యాక్సన్ విల్లే యాజమాన్యం అమిత్ ను ఉద్యోగం నుంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని కేసు ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది.
ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, వేగంగా తీర్పు రావచ్చని అక్కడి లాయర్లు భావిస్తున్నారు. భారత సంతతికి చెందిన అమిత్ చేసిన పనికి అక్కడి ఎన్ఆర్ఐలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పనులతో దేశం కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని అంటున్నారు. ఇలాంటి పనులు చేయవద్దని ప్రవాసులను కోరుతున్నారు.