Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ట్రంప్ ను నమ్ముతున్న అమెరికన్లు... తాజా సర్వే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Oct 2024 4:19 AM GMT
ఆ విషయంలో ట్రంప్  ను నమ్ముతున్న అమెరికన్లు... తాజా సర్వే!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ అనంతరం రంగంలోకి దిగిన కమలా హారిస్ వైపే ఒపినియన్ పోల్ ఫలితాలు అనుకూలంగా వస్తున్న సయమలో.. ట్రంప్ తిరిగి పుంజుకున్నారు.

అవును.. జోబైడెన్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఉన్న సమయంలో ట్రంప్ ఆధిపత్యం నడిచిందనే కామెంట్లు వినిపించాయి. దీంతో.. జో బైడెన్ స్థానంలో కమలా హారిస్ ను రంగంలోకి దింపారు డొమోక్రాట్లు! అప్పటి నుంచి ట్రంప్ పై హారిస్ పైచేయి సాధిస్తూనే ఉన్నారు. వీరి మధ్య ఒపినియన్ పోల్స్ లో తేడా సుమారు 4 నుంచి 6 శాతం వరకూ ఉండేదని కథనాలు వచ్చేవి.

అనంతరం వెలువడిన సర్వేల్లో ఇద్దరికీ వచ్చే ఓట్లలో తేడా తగ్గుతూ కనిపించింది. దీంతో.. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై అంచనావేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ సమయంలో తాజాగా వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కంటే... మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ - హమాస్, రష్యా - ఉక్రెయిన్ యుద్ధాలను డీల్ చేసే విషయంలో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంపే బెటరంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒపినియన్ పోల్ లో వెల్లడైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో ఏడు రాష్ట్రాల్లో ఒక్కోచోటా 600 మంది నమోదిత ఓటర్లు పాల్గొన్నారు.

ఈ ఏడు రాష్ట్రాల్లోనూ అరిజోనా, జార్జియా, మిషిగన్ లలో కమలా హారిస్ ముందంజలో ఉండగా... పెన్సిల్వేనియా, నెవెడా ల్లో ట్రంప్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇక విస్కాన్సిన్, నార్త్ కరొలైనాల్లో ఇద్దరి మధ్యా పోటాపోటీ వాతావరణం నెలకోంది. ఈ యుద్ధాల వేళ దేశాన్ని ట్రంప్ అయితే మెరుగ్గా నడిపిస్తారని సర్వే అభిప్రాయపడింది.

యుద్ధం విషయంలోనే కాకుండా... వలసదారుల సమస్యను, ఆర్థిక వ్యవస్థను ట్రంప్ బాగా డీల్ చేయగలరని కొంతమంది అభిప్రాయపడుతుంటే... ఆరోగ్య సమ్రక్షణ, హౌసింగ్ అంశాల విషయంలో కమలా హారిస్ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని పలువురు నమ్ముతున్నారు.