Begin typing your search above and press return to search.

అమెరికాలో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు ఎందుకు జరుగుతాయో తెలుసా?

ఈవీఎంల పనితీరుపై ఇప్పటికి కూడా అనేక సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. అయినా మన దేశం మాత్రం ఈవీఎంలనే నమ్ముకుంటోంది.

By:  Tupaki Desk   |   8 May 2024 5:30 PM GMT
అమెరికాలో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు ఎందుకు జరుగుతాయో తెలుసా?
X

మదేశంలో కమతాలు తక్కువ జనాభా ఎక్కువ. అమెరికాలో భూమి ఎక్కువ జనాభా తక్కువ. అందుకే వారికి వ్యవసాయంలో ఎన్నో రాయితీలు ఇస్తుంటారు. అక్కడ వ్యవసాయం చేయడం చాలా సులభం. మన దేశంలో వ్యవసాయం భారమే. అక్కడ చట్టాలు కూడా అంతే. కఠినంగా ఉంటాయి. అందుకే వారు తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. కానీ మన దేశంలో అడుగడుగునా మోసాలే. అన్నింట్లో దొంగతనాలే. దీంతో ఎవరు ఎవరిని నమ్మరు.

అమెరికాలో ఇప్పటికి కూడా ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయి. అదే మన దేశంలో ఈవీఎంలను వాడుతుంటారు. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికి కూడా అనేక సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. అయినా మన దేశం మాత్రం ఈవీఎంలనే నమ్ముకుంటోంది. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే నేటికి ఎన్నికలు నిర్వహించడం మామూలు విషయం కాదు.

అక్కడా ప్రజాస్వామ్యమే. మనది కూడా ప్రజాస్వామ్యమే. కానీ ఆచరణలో చాలా తేడాలుంటాయి. అక్కడ తప్పు చేస్తే అధ్యక్షుడైనా బోనెక్కాల్సిందే. మన దేశంలో ఎమ్మెల్యే అయితే చాలు అతడిని అరెస్టు చేయడానికి నానా తంటాలు పడాలి. బ్యాలెట్ ఓటింగ్ శ్రమతో కూడుకున్నదే కానీ దాని అమలులో ఎలాంటి అనుమానాలు ఉండవు.

ఇక్కడ జన, ధన, బలం కలిగిన అభ్యర్థులు దొంగ ఓట్లు వేయించుకునే అవకాశం ఉండటంతో ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఏవో మోసాలు ఉన్నాయని ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. కానీ మనదేశం మాత్రం ఈవీఎంల వాడకానికే ప్రాధాన్యం ఇస్తోంది. అదే అమెరికాకు మనకు ఉన్న తేడా అని తెలుస్తోంది.

మనదేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. అందాక ఆగాల్సిందే. అధికారం ఎవరిదో చూడాలి మరి.