Begin typing your search above and press return to search.

అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌పై సంచ‌ల‌న నివేదిక‌!

అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌రు నాటికి ఇవి పూర్త‌వుతాయ‌ని లెక్క‌లు చెబుతున్నాయి

By:  Tupaki Desk   |   30 Jun 2024 11:30 PM GMT
అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌పై సంచ‌ల‌న నివేదిక‌!
X

అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌రు నాటికి ఇవి పూర్త‌వుతాయ‌ని లెక్క‌లు చెబుతున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం అధికార ప‌క్షం స‌భ్యుల నుంచే ఆయ‌నపై కొన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌తిమ‌రుపు, శారీర‌క అనారోగ్యంతో బైడెన్ వ్య‌వ‌హ‌రిస్తున్నతీరును వారు ప్ర‌శ్నిస్తున్నారు. బైడెన్ వయసు అయిపోయిందని, ప్రెసిడెంట్ పదవికి తగరని రిపబ్లికన్‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల కాలంలో బైడెన్ వ్య‌వ‌హ‌రించిన తీరే.

ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని.. కీల‌క‌మైన డిబేట్‌లో బైడెన్ ధాటిగా స‌మాధానం చెప్ప‌లేక తెల్ల మొహం వేశారు. అధ్య‌క్ష రేసులో ఉన్న ట్రంప్‌కి ఆయ‌న స‌రైన విధంగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. దీంతో బైడెన్ ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా.. బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిని వివ‌రిస్తూ.. ఓ సంచ‌ల‌న రిపోర్ట్ వెలుగు చూసింది. ఈ నివేదిక‌.. బైడెన్ ఆరోగ్య ప‌రిస్థితిని మాత్ర‌మే కాదు.. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌ను కూడా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఇదీ..నివేదిక సారాంశం..

+ బైడెన్ ఆరు గంటలు మాత్రమే పని చేయగలరు.

+ అది కూడా ప‌గ‌టి పూట బాగా వెలుతురు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ప‌నిచేయ‌గ‌ల‌రు.

+ ఏ మాత్రం చీకటి పడినా బైడెన్ శారీర‌క‌, మాన‌సిక‌ తీరులో మార్పు వస్తోంది.

+ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పని చేయగల‌రు.

+ విదేశాలకు వెళ్లాల్సి వస్తే.. మ‌రింత‌ ఇబ్బంది పడుతున్నారు.

+ బైడెన్ ఎక్కువ సమయం ఇంటికే ప‌రిమితం అయ్యేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు.

+ ఉన్నట్టుండి బిగుసు కు పోతున్నారు.

+ ఒంటరిగా నడుచుకుంటూ ఎటో వెళ్తున్నారు.

+ చాలా సార్లు బైడెన్ వింతగా ప్రవర్తిస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌పై ఇప్పుడు అమెరికా స‌మాజం చ‌ర్చిస్తోంది. మ‌రోవైపు ఎన్నిక‌లు, ఇటు బైడెన్ మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యంపై చ‌ర్చ జ‌రుగుతున్న క్ర‌మంలో అధ్యక్ష ఎన్నిక‌ల రేసు నుంచి ఆయ‌న ఎప్పుడైనా త‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.