Begin typing your search above and press return to search.

పట్టపగలు చిమ్మచీకట్లు.. సూర్యగ్రహణం ఎఫెక్టు.. ఎగబడ్డ అమెరికన్లు

దీని ప్రభావంతో నార్త్ అమెరికాలో పట్టపగలు 4 నిమిషాలకు పైగా చిమ్మచీకట్లు కమ్మేశాయి

By:  Tupaki Desk   |   9 April 2024 6:05 AM GMT
పట్టపగలు చిమ్మచీకట్లు.. సూర్యగ్రహణం ఎఫెక్టు.. ఎగబడ్డ అమెరికన్లు
X

ఖగోళ అద్భుంగా చెప్పే సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికన్లకు మాత్రమే కాదు..అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారైనా సరే.. లైవ్ లో ఈ అద్భుతాన్ని చూసే అవకాశం కలిగింది. సూర్యుడికి.. భూమికి మధ్య చంద్రుడు రావటంతో సంపూర్ణ సూర్యగ్రహణం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో నార్త్ అమెరికాలో పట్టపగలు 4 నిమిషాలకు పైగా చిమ్మచీకట్లు కమ్మేశాయి.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆకాశంలో అద్భుతం మొదలైంది. భూమికి.. సూర్యుడికిమధ్య చంద్రుడు చేరటంతో గ్రహణం మొదలైంది. చూస్తుండగానే అప్పటివరకు ఉన్న వెలుగులు నెమ్మదిగా మసకబారి.. చివరకు చిమ్మచీకట్లు కమ్మేశాయి. ఆ సమయంలో సూర్యుడు భగభగలాడే స్థితి నుంచి సన్నటి బంగారు రింగు మాదిరి మారి.. ఆపై పూర్తిగా కనిపించకుండా పోయాడు.

సౌత్ పసిఫిక్ లో ప్రారంభమైన గ్రహణం నార్త్ అమెరికాలోకి ప్రవేశించి.. ఆపై మెక్సికో.. కెనడా.. అట్లాంటా మీదుగా సాగింది. సరిగ్గా 4.28 నిమిషాల పాటు గ్రహణం కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా చీకట్లు తొలగిపోయి.. యథావిధి పరిస్థితినెలకొంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహాన్ని చూసేందుకు అమెరికన్లు స్టేడియంలలో.. బీచ్ లలో.. వ్యూ పాయింట్ల వద్ద.. జూలకు పోటెత్తారు. టీవీ ఛానళ్లు సైతం పెద్ద ఎత్తున లైవ్ ను ఏర్పాటు చేశాయి.

ఈ సూర్యగ్రహాన్ని నేరుగా వీక్షించేందుకు గంటల తరబడి ప్రయాణం చేసి మరీ నార్త్ అమెరికా నగరాలకు చేరుకున్నారు. అంతేకాదు.. గ్రహణ సమయంలో జంతువుల ప్రవర్తనలో వచ్చే మార్పులు పరిశీలించేందుకు పరిశోధకులు జూలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. భూవాతావరణంలో మార్పులను గుర్తించేందుకు నాసా మూడు సౌండ్ రాకెట్లను ప్రయోగించింది. దీంతో పాటు 600 బెలూన్లనుఆకాశంలోకి ఎగురవేసి మరో ప్రయోగాన్ని చేపట్టినట్లుగా వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. సూర్యగ్రహణం వీడియోలు ఇప్పుడు వైరల్ గామారాయి. అమెరికా మొత్తంలో మెక్సికన్ బీచ్ సైడ్ రిసార్ట్ పట్టణం మజట్లాన్ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు పర్ ఫెక్టు ప్లేస్ గా పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో ఏర్పడిన సూర్యగ్రహణాల్లో తాజా గ్రహణం అత్యంత సుదీర్ఘమైనదిగా చెబుతున్నారు. గడిచిన వందేళ్లలో న్యూయార్క్ రాష్ట్రంలోని పశ్చిమ.. ఉత్తర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించినట్లు చెబుతున్నారు. ఇలాంటి గ్రహణాన్ని అమెరికన్లు మళ్లీ చూడాలంటే 2044 ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే.. ఈసారి సూర్యగ్రహణాన్ని అమెరికాన్లు పెద్ద ఎత్తున వీక్షించారు.

ఇదిలా ఉంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారత్ కు చెందిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం వీక్షించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఎందుకంటే.. రోదసీలో దీన్ని ఉంచిన స్థానమే దీనికి కారణంగా చెబుతున్నారు. గ్రహణం సమయంలో భానుడిని పూర్తిగా కమ్మేసిన చంద్రుడి వెనుక వైపు ఆదిత్య ఎల్1 ఉంది. అంటే.. సూర్యుడికి.. చంద్రుడికి మధ్యలో కావటంతో సూర్యగ్రహాణాన్ని వీక్షించలేని పరిస్థితి.