Begin typing your search above and press return to search.

కోహ్లి మారిపోయాడు.. రోహిత్ బెస్ట్.. గిల్ వేస్ట్.. మాజీ స్పిన్నర్ సంచలనం

ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న అమిత్ మిశ్రా.. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   16 July 2024 11:36 AM GMT
కోహ్లి మారిపోయాడు.. రోహిత్ బెస్ట్.. గిల్ వేస్ట్.. మాజీ స్పిన్నర్ సంచలనం
X

భారత జట్టుకు లెగ్ స్పిన్నర్ గా ప్రాతినిధ్యం వహించిన అమిత్ మిశ్రా ఉన్నట్లుండి వివాదాస్పద వ్యాఖ్యలకు దిగాడు. తన కెరీర్ ఆసాంతం కోహ్లి, రోహిత్ లతో కలిసి ఆడిన అతడు విమర్శలకు దిగాడు. 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టి20ల్లో దేశానికి ఆడిన లెగ్ బ్రేక్ బౌలర్.. గత ఏడాది వరకు ఐపీఎల్ లో కనిపించాడు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న అమిత్ మిశ్రా.. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ వచ్చాక కోహ్లి ప్రవర్తన మారిందని ఆరోపించాడు. అంతేకాదు.. రోహిత్ తో కోహ్లిని పోల్చాడు. వీరిద్దరి మధ్యన ఎంతో తేడా ఉందన్నాడు.

అనుబంధం వివరిస్తూనే..

అమిత్ మిశ్రా 22 టెస్టుల్లో 76 వికెట్లు పడగొట్టాడు. చాన్నాళ్లు టీమిండియాకు ఆడే సత్తా ఉన్నవాడిగా కనిపించినా అంచనాలను నిలబెట్టుకోలేదు. మరోవైపు తాజా ఇంటర్వ్యూలో కోహ్లీ, రోహిత్‌తో తన అనుబంధాన్నివెల్లడించాడు. వారిద్దరిలో ఎవరు ఉత్తమం? జట్టులో ఎవరికి స్నేహితులు ఎక్కువ అనే ప్రశ్నలు యూ ట్యూబర్ నుంచి రాగా.. మిశ్రా ఆసక్తికరంగా జవాబులిచ్చాడు. ‘‘అబద్ధం చెప్పను. తోటి క్రికెటర్‌ గా కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం. కెప్టెన్ అయ్యాక మాత్రం అతడు మారిపోయాడు. అంతేకాదు.. జట్టులో కోహ్లికి స్నేహితులు తక్కువ. కోహ్లితో నేను గతంలోలా ఉండడం లేదు. మాట్లాడడం మానేశా.

కోహ్లిని విమర్శిస్తూ..

పేరు డబ్బు వచ్చాయని.. ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించి వస్తారని కొంతమంది భావిస్తారంటూ కోహ్లిని ఉద్దేశించి మిశ్రా ఆరోపణలు చేశాడు. తాను అలా వెళ్లేవాడానికి కాదని.. చెప్పాడు. కాగా.. రోహిత్, కోహ్లి ఇద్దరి తీరు వేరని.. చెప్పుకొచ్చాడు. తాను చాలా ఏళ్లుగా టీమ్ ఇండియాకు ఎంపికవలేదని.. అయినా కెరీర్ మొదట్లో రోహిత్ తనతో ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలానే ఉంటాడని వివరించాడు. ఈవెంట్ లేదా ఐపీఎల్‌ సందర్భంగా కలిస్తే చాలా సరదాగా మాట్లాడతాడని తెలిపాడు. కెప్టెన్ అయినా స్నేహంగా మెలిగి జోక్‌ లు వేశాడని వివరించాడు. ప్రపంచంలోనే నంబర్ వన్‌ కెప్టెన్ రోహిత్ అని.. ప్రపంచ కప్, ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌ సాధించాడని రోహిత్ ను పొగిడాడు. కాగా, యువ క్రికెటర్ శుభమన్ గిల్ ను మిశ్రా విమర్శించాడు. అతడికి కెప్టెన్సీ చేతకాలేదంటూ ఆరోపించాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో గిల్ భారత జట్టు కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే.