సీఐడీ బాస్ మీద అమిత్ షా యాక్షన్...?
ఏపీ సీఐడీ ఇపుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది. సాధారణంగా నేర పరిశోధనకు అంతా సీబీఐ పేరుని వాడతారు
By: Tupaki Desk | 28 Sep 2023 12:30 PM GMTఏపీ సీఐడీ ఇపుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది. సాధారణంగా నేర పరిశోధనకు అంతా సీబీఐ పేరుని వాడతారు. హై ప్రొఫైల్ కేసులలో సీబీఐ విచారణకు డిమనడ్ చేస్తారు. జగన్ కేసు తీసుకున్నా జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ కేసు తీసుకున్న సీబీఐ వారిని అరెస్ట్ చేసింది. ఇక చంద్రబాబు వంటి బిగ్ షాట్ విషయంలో కూడా పడితే సీబీఐ విచారణ పడాలని ప్రత్యర్ధులు అంతా అనుకుంటూ ఉండేవారు.
అయితే ఏపీ సీఐడీయే చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఇప్ప ఇరవై రోజులుగా ఉన్నారు. దాంతో ఏపీ సీఐడీ సత్తా ఏమిటో అందరికీ మరోసారి తెలిసింది. ఈ కేసులో గత రెండేళ్ళుగా దర్యాప్తు చేస్తూ రెండు వేలకు పైగా పేజీలతో నివేదికను తయారు చేయడం కూడా మామూలు వ్యవహారం కాదనే అంటారు.
అదే సమయంలో చంద్రబాబు మీద బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పడం వల్లనే ఏపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇపుడు కోర్టులలో బాబుకు చుక్కెదురు అవుతోంది అంటే ఏపీ సీఐడీ విచారణ ఏ స్థాయిలో ఉందో అని అనుకున్న వారూ లేకపోలేదు. ఇదిలా ఉంటే ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీద టీడీపీ మండిపోతోంది.
సహజంగానే ఇలాగే రియాక్షన్ ఉంటుంది కూడా. ఇపుడు ఏకంగా ఆయన మీద కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసే దాకా టీడీపీ కోపం వెళ్ళిందని అంటున్నారు. చంద్రబాబు ఎటూ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఇపుడు లోకేష్ ని కూడా అరెస్ట్ చేసేందుకు దూకుడు చేస్తోంది. దీంతో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర హోం మంత్రిని కలసి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు.
సీఐడీ చీఫ్ రూల్స్ కి విరుద్ధంగా పని చేస్తున్నారని, అధికార వైసీపీ చెప్పింది చేస్తున్నారు అని ఆయన ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలను ఆయన అమరావతి ఢిల్లీలలో ఒక అధికారిగా ఎలా ఏర్పాటు చేస్తారు అని ఆయన అంటున్నారు అలాగే విచారణలో ఉన్న విషయాలను ఆయన లీక్ చేస్తున్నారు అని అంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఏమీ లేకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపారని రామ్మోహన్ కేంద్ర హోం మంత్రి దృష్టికి తెచ్చారు. కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా బాబు పేరు లేదని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు సీఐడీ చీఫ్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని కూడా చెప్పడం విశెషం.
ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి దీని మీద ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనంది చర్చగా ఉంది. అదే విధంగా చూస్తే ఈ కేసు విషయంలో బీజేపీ పెద్దలు ఎలా తీసుకుంటున్నారు అన్నది కూడా అమిత్ షా స్పందనను బట్టి తెలుస్తుంది అంటున్నారు. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాలు కేంద్రానికి తెలియవు అనుకోవడం కూడా తప్పే అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా ఫిర్యాదు చేయడం వెనక బాబు అరెస్ట్ కంటే కూడా లోకేష్ అరెస్ట్ ని అడ్డుకోవడమే అసలు లక్ష్యం గా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి అమిత్ షా యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటాయో.