Begin typing your search above and press return to search.

దేశంలో మధ్యంతర ఎన్నికలు.. షా సంచలన ప్రకటన

దేశంలో జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచనల వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 9:56 AM GMT
దేశంలో మధ్యంతర ఎన్నికలు.. షా సంచలన ప్రకటన
X

దేశంలో జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచనల వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈనెల 18న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడతగా పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ పరిస్థితుల్లో మరోమారు వన్ నేషన్-వన్ ఎలక్షన్ తెరమీదకు వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంలోనూ మోడీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ.. అది సాధ్యపడలేదు. పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది.

అయితే.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ టర్మ్ ఎన్నికలను జమిలీ పద్ధతిలోనే నిర్వహిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలోనూ చెప్పింది. ఎట్టకేలకు ఈ కమిటీ రిపోర్టు ఇవ్వడంతో.. కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై ముందడుగు వేయబోతోంది. ఈ మేరకు బై ఎలక్షన్లు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తాజాగా అమిత్ షా వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను నిర్వహించబోతోంది. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చారు. మోడీ ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వంలోని కీలక నేత వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

మోడీ హ్యాట్రిక్ విజయం సాధించి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వంద రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, అమలు చేసిన పథకాలపై వివరించారు. అదే క్రమంలో జమిలీ ఎన్నికలపై విలేకరుల అడిగిన ప్రశ్నకూ ఆయన సమాధానం ఇచ్చారు. జమిలీపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక అందించిందని.. సానుకూలంగా రిపోర్టు వచ్చిందని చెప్పారు. ఈ ప్రభుత్వంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కానీ.. ఎప్పుడు ఎన్నికలకు వెళ్తామని మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.