Begin typing your search above and press return to search.

నెగ్గిన మహిళా బిల్లు....2029 నుంచి మాత్రమే అమలు...!

బిల్లు గురించి లోక్ సభలో అరవై మందికి పైగా సభ్యులు మాట్లాడారు. సభ్యుల ప్రశ్నలకు సందేహాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:30 PM GMT
నెగ్గిన మహిళా బిల్లు....2029 నుంచి మాత్రమే అమలు...!
X

లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మద్దతుతో నెగ్గింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓటు వేశారు ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రాత్మకమైన మహిళా బిల్లు లోక్ సభలో మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత నెరవేరి నారీ మణుల కలను తీర్చింది.

ఇక ఈ బిల్లు మీద దాదాపుగా ఎనిమిది గంటల పాటు సుదీర్ఘమైన చర్చ సాగింది. బిల్లు గురించి లోక్ సభలో అరవై మందికి పైగా సభ్యులు మాట్లాడారు. సభ్యుల ప్రశ్నలకు సందేహాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.

ఓటింగ్ కోసం ముందుగా ఎలక్ట్రానింగ్ ఓటింగ్ విధానం అనుకున్నా టెక్నికల్ రీజన్స్ వల్ల సభ్యులకు స్లిప్స్ ఇచ్చారు. అలా ఎరుపు ఆకుపచ్చ స్లిప్స్ ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. ఇక ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉన్నారు. అంటే టోటల్ గా ఈ బిల్లుకు 99 శాతం పైగా మద్దతు లోక్ సభలో దక్కింది అన్న మాట. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ప్రవేశపెడతారా లేక 2010లో ప్రవేశపెట్టినందున చట్టంగా మారుస్తారా అన్నది చూడాల్సి ఉంది.

అయితే ఈ బిల్లుకు నారీ శక్తి పేరుతో బీజేపీ కొత్తగా ప్రవేశపెట్టడం, కొన్ని మార్పులు చేయడం వల్ల రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారు అంటున్నారు. అదే విధంగా తమ ముద్ర ఉండాలని బీజేపీ భావిస్తున్నందువల్ల ఉభయ సభలలో ఆమోదం తీసుకుంటారు అని అంటున్నారు.

ఇక ఈ బిల్లు కేవలం రెండు రోజుల వ్యవధిలో ఆమోదం పొందినా అమలు మాత్రం మరో ఆరేళ్ల తరువాతే అంటున్నారు ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి లోక్ సభలో చెప్పారు. ఈ బిల్లుని 2029 ఎన్నికల్లోనే అమలు చేస్తారు అని ఆయన చెప్పారు. దానికంటే ముందు జనాభా గణన, డీ లిమిటేషన్ వంటి వ్వవహారాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ బిల్లు అమలుఇఉ నోచుకుంటే పార్లమెంట్ చట్టసభలలో 33 శాతం రిజర్వెషన్లు కచ్చితంగా మహిళలకు అమలు చేయాల్సి ఉంది. మరో వైపు చూస్తే మజ్లీస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలే ఈ బిల్లుని వ్యతిరేకించారు. అసదుద్దీన్ ఒవైసీ. ఇంతియాజ్ జలీల్ ఈ బిల్లుని వ్యతిరేకించారు.

అంతకు ముందు అసదుద్దీన్ మాట్లాడుతూ ఓబీసీలు, మైనారిటీలకు ఈ బిల్లులో సబ్ కోటా కింద రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఈ బిల్లు లేకపోవడం వల్లనే వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ లో తొలి బిల్లుగా మహిళా బిల్లు ఆమోదం పొందడం విశేషం. ఇది రికార్డుగానే చూస్తున్నారు.