Begin typing your search above and press return to search.

కొత్త సీఎంలు లెక్క తేల్చకుండా మనమరాళ్లతో చెస్ ఆడటమా షా?

ఇలాంటివేళ.. మౌనంగా ఉన్న మోడీషాలు అంతకంతకూ టెన్షన్ ను పెంచేస్తున్నారు. ఇలాంటి వేళ.. కేంద్రహోం మంత్రి అమిత్ షా ఒక పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:55 AM GMT
కొత్త సీఎంలు లెక్క తేల్చకుండా మనమరాళ్లతో చెస్ ఆడటమా షా?
X

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులు. ఆదివారంతో ఎనిమిది రోజులు అవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు గత ఆదివారం వెల్లడయ్యాయి. మధ్యాహ్నానానికి ఏ పార్టీకి ఎన్ని రాష్ట్రాల్లో అధికారం వచ్చిందన్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్) బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది.

ఇంతవరకు బాగున్నా.. అప్పటి నుంచి ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కొలువు తీర్చలేదు. ముఖ్యమంత్రి ఎంపికపై అనూమ్య జాప్యాన్ని చేస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున జాగు జరుగుతూ విమర్వల్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తుండటం గమనార్హం. మూడు రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది ప్రజలు తమ తదుపరి ముఖ్యమంత్రులు ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు.. వాదోపవాదాలు సాగుతున్నాయి.

ఇలాంటివేళ.. మౌనంగా ఉన్న మోడీషాలు అంతకంతకూ టెన్షన్ ను పెంచేస్తున్నారు. ఇలాంటి వేళ.. కేంద్రహోం మంత్రి అమిత్ షా ఒక పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో తన మనమరాళ్లతో చెస్ ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. ఇందులో అమిత్ షా ఒక్కరే చెస్ ఆడుతున్నట్లుగా.. మనమరాళ్లు ఇద్దరు తమ తాత వేస్తున్న ఎత్తును ఆసక్తిగా చూస్తున్నట్లుగా ఫోటో ఉంది.

దీనికి క్యాప్షన్ ఇచ్చిన అమిత్ షా.. "ఒక మంచి ఎత్తుతో ఆగిపోకండి. ఎప్పటికీ బెస్ట్ కోసం చూడండి" అంటూ పోస్టు పెట్టారు. ముఖ్యమంత్రుల ఎంపికపై వస్తున్న విమర్శలకు సమాధానంగా అమిత్ షా ట్వీట్ చేశారని చెబుతున్నారు. అయితే.. చెస్ ఆడే ఫోటోను.. దానికో పంచ్ లైన్ తో ట్వీట్ చేసే కన్నా.. ముఖ్యమంత్రుల్ని ప్రకటిస్తే సరిపోయేది కదా? అన్నదిప్పుడు మాటగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.