Begin typing your search above and press return to search.

అమిత్ షా సభ.. ఎన్నికల కోడ్ లోకే.. మిస్ ప్లానింగ్?

ఈ రోజు అదిలాబాద్ పట్టణంలో నిర్వహించే సభ పార్టీ ఖర్చు పరిధిలోకి వెళుతుందని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఈ తరహా సభల్ని నిర్వహించాలని.. దీనికి జన గర్జనగా పేరు పెట్టటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:29 AM GMT
అమిత్ షా సభ.. ఎన్నికల కోడ్ లోకే.. మిస్ ప్లానింగ్?
X

ముందుగా డిసైడ్ చేసిన ప్రోగ్రాం అయినప్పటికీ.. కేంద్ర మంత్రి.. బీజేపీ కీలక నేత అమిత్ షా తెలంగాణ పర్యటనకు మరోసారి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రాక మునుపు డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం.. తాజా పరిణామాలతో ఎన్నికల కోడ్ లోకి అమిత్ షా బహిరంగ సభ రానుంది. ఈ రోజు (మంగళవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న సంగతి తెలిసిందే. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి ఈ సభ వెళ్లనుంది.

అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగే బీజేపీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇప్పటికి డిసైడ్ చేయని వైనం తెలిసిందే. ఈ కారణంగా.. బీజేపీ అభ్యర్థులు ఎవరన్నది తేల్లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు అదిలాబాద్ పట్టణంలో నిర్వహించే సభ పార్టీ ఖర్చు పరిధిలోకి వెళుతుందని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఈ తరహా సభల్ని నిర్వహించాలని.. దీనికి జన గర్జనగా పేరు పెట్టటం తెలిసిందే.

ఈ సభకు అమిత్ షాతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు.. టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు.. పలువురు రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్ ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి రాజకీయ బహిరంగ సభ ఇదే కావటం గమనార్హం. ఈ సభ నేపథ్యంలో అదిలాబాద్ పట్టణం మొత్తాన్ని కాషాయ జెండాలతో నింపేశారు. పార్టీ నేతల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం ద్వారా.. అదిలాబాద్ పట్టణం మొత్తం బీజేపీ జెండాలతో నిండిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. అమిత్ షా నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు బీజేపీ ఎన్నికల ఎజెండా ఏమిటన్నది తెలిసే వీలుందని చెప్పాలి.