Begin typing your search above and press return to search.

చెస్ బోర్డును శాసించిన 'ఒక భారత రాణి'... హంపీపై ఆనంద్ మహీంద్ర!

ఇందులో భాగంగా.. వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచింది.

By:  Tupaki Desk   |   29 Dec 2024 11:30 AM GMT
చెస్  బోర్డును శాసించిన ఒక భారత రాణి... హంపీపై ఆనంద్  మహీంద్ర!
X

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘన సాధించింది. ఇందులో భాగంగా.. వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచింది. 8.5 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానానికి దూసుకెళ్లి విజయం సాధించింది. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచింది. హంపీకి ఈ తరహా ఛాంపియన్ షిప్ విజేతగా నిలవడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ హంపీ ఛాంపియన్ గా నిలిచారు. దీంతో... చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటికంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ గా హంపీ రికార్డ్ సృష్టించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు... ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ హంపీకి అభినందనలు అని తెలుపుతూ ఆమె విజయం దేశానికి గర్వకారణం అని తెలిపారు. మనదేశ చెస్ క్రీడాకారులకు 2024 మరిచిపోలేని సంవత్సరం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.

అవును... ఎన్నో ఆసక్తికర విషయాలు, ఇన్స్ పిరేషన్స్ కలిగించే వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం.. అలాంటివి సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాటిపై ఆసక్తికరంగా స్పందించడం చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై స్పందించారు.

ఇందులో భాగంగా... ఒక భారత రాణి చెస్ బోర్డును శాసించారని.. కోనేరు హంపీ తన అద్భుతమైన ఆట తీరుతో తమల్ని ఎంతో గర్వించేలా చేశారని చెబుతూ... భారత చెస్ కు అద్భుతమైన సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాదికి విజయవంతమైన ముగింపును అందించినందుకు కృతజ్ఞతలు అని అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

కాగా.. ఇటీవల తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డ్ సృష్టించారు.