స్పీకర్ అయ్యన్నకు షాకిచ్చిన ఆనం... కంటిన్యూ చేస్తున్నారు తగ్గేదేలే!
ఈ సమయంలో తాజాగా తిరుమల వెళ్లిన ఆయన మరోసారి ఈ విషయంపై స్పందించారు. గత ప్రభుత్వంపై విమర్శలూ చేశారు.
By: Tupaki Desk | 17 Aug 2024 3:38 PM GMTఏపీలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి ఒక ప్రశ్న ఎదురవుతుంది. కొన్ని సార్లు ఎదురవ్వకుండా కూడా ఆయన స్పందించే విషయం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం. ఈ సమయంలో తాజాగా తిరుమల వెళ్లిన ఆయన మరోసారి ఈ విషయంపై స్పందించారు. గత ప్రభుత్వంపై విమర్శలూ చేశారు.
ఇందులో భాగంగా జగన్ బయట మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని అన్నారు. ఆయనతో పాటు వైసీపీ నేతలూ అసెంబ్లీకి రావాలని.. వస్తే మాట్లాడటానికి నిబంధనలకు అనుగుణంగా, పరిస్థితులకు తగ్గట్లుగా అన్నట్లుగా సమయం ఇస్తామని తెలిపారు. ఇలా తిరుమలలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. షాకిచ్చారు!
అవును... తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన విషయంపై తన సొంత పార్టీ నేతకే ఆనం వెంకటరమణారెడ్డి షాకిచ్చారు! మీరంటే గౌరవం ఉందని అంటూనే సుతిమెత్తగా చురకలంటించినంత పని చేశారు. అది కూడా రహస్యంగా కాదు సుమా.. నేరుగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... "దయచేసి తిరుమలలో రాజకీయాలో వద్దు నా విన్నపం" అని అన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలో అయ్యన్నపాత్రుడు చేసిన రాజకీయ వ్యాఖ్యల వీడియోనూ పోస్ట్ చేసిన ఆనం వెంకటరమణారెడ్డి.. ఈ మేరకు ట్వీట్ పెట్టారు. "సర్ మీరు అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా, దయచేసి తిరుమలలో రాజకీయాలు వద్దు నా విన్నపం" అని ట్వీట్ చేస్తూ తిరుమలను ట్యాగ్ చేశారు. అయితే దీనిపై స్పీకర్ కానీ, ఇటు టీడీపీ నేతలు కానీ స్పందించలేదు.
కాగా... టీడీపీ నేతలనే కాదు.. తిరుమలలో ఎవరు రాజకీయాలు మాట్లాడినా ఆనం వెంకటరమణారెడ్డి సహించరు. కొంతమందికి సీరియస్ గా కోటింగ్ ఇస్తే, మరి కొంతమందికి సున్నితంగా అంటిస్తుంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రి రోజాపైనా ఆనం ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఇటీవల సినిమా నటుడు శివాజీని అలాగే తగులుకున్నారు! ఈ క్రమంలో ఇప్పుడు స్పీకర్ అయ్యన్న వంతు వచ్చింది!