Begin typing your search above and press return to search.

ప‌రీక్ష‌లకు ఢుమ్మా కొట్టి మ‌రీ ప్రేయ‌సి కోసం!

ఈ సంద‌ర్భంగా పారిశ్రామిక దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా కూడా త‌న ప్రేమ క‌థ‌ని వెలంటైన్స్ డే సంద‌ర్భంగా రివీల్ చేసారు. ఆసంగ‌తేంటో ఆయ‌న మాట్లోనే...

By:  Tupaki Desk   |   14 Feb 2025 4:30 PM GMT
ప‌రీక్ష‌లకు ఢుమ్మా కొట్టి మ‌రీ ప్రేయ‌సి కోసం!
X

నేడు ప్రేమికుల దినోత్స‌వం. ప్రేమికులంతా ప్రేమ పాఠాల్లో బిజీ. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని జోడీలు ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా పారిశ్రామిక దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా కూడా త‌న ప్రేమ క‌థ‌ని వెలంటైన్స్ డే సంద‌ర్భంగా రివీల్ చేసారు. ఆసంగ‌తేంటో ఆయ‌న మాట్లోనే... నేను హార్వార్డ్ యూనివ‌ర్శిటీలో చ‌దువుతోన్న రోజుల్లో ఓసారి ఇండోర్ లోని ఓ కాలేజీకి వెళ్లా.

అక్క‌డ ఒక అమ్మాయి ఈవెంట్ లో హుషారుగా పాల్గొంటుంది. చూడ‌గానే ప్రేమ‌లో ప‌డిపోయాను. ఆమెనే ఫాలో అయ్యాను. త‌న పేరు అనురాధ‌. ముంబైలో ఇంట‌ర్ చ‌దువుతుంది. ఓవారం అక్క‌డే ఉంటుంద‌ని తెలిసింది. కానీ నేను వెంట‌నే హార్వార్డ్ కి వె ళ్లి సెమిస్ట‌ర్ రాయాలి. కానీ ఆ స‌మ‌యంలో నాకు సెమిస్ట‌ర్ కంటే అమ్మాయే ముఖ్య‌మ‌నిపించింది. ప‌రీక్ష‌లు మానేసి అక్క‌డే ఉండి ఆ అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకున్నా.

అప్పుడు త‌న‌కి 17 ఏళ్లు. ఆమెకు కూడా న‌న్ను ఇష్ట‌ప‌డుతుంద‌ని తెలుసుకుని ప్ర‌పోజ్ చేసాను. నా చ‌దువు, మార్కులు త‌న‌ని ఆక‌ట్టుకున్నాయని చెబుతూనే ప్రేమ‌కు ప‌చ్చ జెండా ఊపింది` అని తెలిపారు. ఆనంద్ మ‌హీంద్రా ఆమెనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. ప్ర‌స్తుతం ఆనంద్ మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు నెర‌వ‌ర్తిస్తున్నారు.

ముంబైకి చెందిన ఈ బిజెనెస్ గ్రూప్ లో ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, స్పేర్స్, నిర్మాణ పరికరాలు, డిఫెన్స్, ఎనర్జీ వంటి త‌యారీ రంగంలో దూసుకుపోతుంది. క‌ల్కి 2898 సినిమా కోసం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఆనంద్ గ్రూప్ టెక్నాలజీ స‌హాయంతోనే కొన్ని కార్లును త‌యారు చేయించుకున్నారు. ఈ సినిమా విష‌యంలో పూర్తి స‌హ‌కారాన్ని ఆనంద్ అందించారు.