8 పేజీల్లో ప్రీ వెడ్డింగ్ కార్డు ప్రత్యేకత ఏంటి అంటే?
మరి ఈ అదిధులు అందుకున్న ప్రీవెడ్డింగ్ కార్డు చూస్తే మతి పోవాల్సిందే. ఇలాంటి వెడ్డింగ్ కార్డు చూడగలమా? అనిపించేలా అంత అద్బుతంగా డిజైన్ చేసారు.
By: Tupaki Desk | 28 Feb 2024 6:40 AM GMTభారత సంపన్నుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- వ్యాపార వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పెళ్లి వేడుక ప్రపంచమే మాట్లాడుకునేలా అంబానీ-వీరేన్ ప్లాన్ చేసారు. జులైలో వివాహం జరుగుతుండగా..గుజరాత్ లోని జామ్ నగర్ మూడు రోజుల ముందొస్తు వేడుకకు ముస్తాబవుతోంది. మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయి.
ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1000 మంది ప్రముఖులు హాజరవుతున్నారు. మరి ఈ అదిధులు అందుకున్న ప్రీవెడ్డింగ్ కార్డు చూస్తే మతి పోవాల్సిందే. ఇలాంటి వెడ్డింగ్ కార్డు చూడగలమా? అనిపించేలా అంత అద్బుతంగా డిజైన్ చేసారు. ప్రీవెడ్డింగ్ వేడుక ఇన్విటేషన్ కార్డు ఏకంగా 8 పేజీల్లో ఉంది. అందులో వేడుక జరిగే స్థలం.. సమయం.. వివిధ ఈవెంట్లకు పెట్టిన డ్రెస్ కోడ్ల వివరాలు ఉన్నాయి.
అంబానీ అండ్ కో జంతుప్రేమికులు కావడంతో అభిరుచికి తగ్గట్టు వివిధ రకాలుగా ఎనిమిది పేజీల్ని డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. మొదటి పేజీలో ప్రకృతితో మమేకమైన పక్షులు జంతువుల తో డిజైన్ వేశారు. మిగతా ఏడు పేజీలు కూడా తమ టేస్ట్ కి తగ్గట్టు ప్రీ వెడ్డింగ్ కార్డుని డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. మార్చి 1న కాక్ టెయిల్ పార్టీతో ప్రీవెడ్డింగ్ వేడుక ప్రారంభమై 3వ తేదీతో ముగుస్తుంది.
మూడు రోజుల పాటు అతిధులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్దమైంది. ప్రత్యేకంగా ఇండోర్ నుచి 21 మంది చెఫ్ లు దించారు. భారతీయ వంటకాలతో పాటు వివిధ దేశాల రుచులు ఈ వేడుకలో భాగమవు తున్నాయి. మొత్తంగా ఈ మూడు రోజుల పాటు 2500 రకాల వంటకాలు అతిధులుకు వడ్డించనున్నారుట.