Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీ హనీ ట్రాప్చ్ అయ్యాడా?... తెరపైకి న్యూడ్ వీడియో!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో నిజం ఇది అని చెప్పేలోపు అబద్దం వైరల్ అయిపోతుందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 5:06 PM GMT
వైసీపీ ఎమ్మెల్సీ హనీ ట్రాప్చ్ అయ్యాడా?... తెరపైకి న్యూడ్  వీడియో!
X

గత కొంతకాలంగా ప్రధానంగా ఒక పార్టీకి చెందిన కొంతమంది నేతల పర్సనల్ విషయాలు అనాలో, అనైతిక విషయాలు అనాలో అవి తెరపై దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా... అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ లకు సంబంధించినవి చెబుతున్న కొన్ని ఆడియో, వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ విషయాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇదే క్రమంలో... ఇటీవల వైసీపీ ఎంపీ వివాదాస్పద వివాహేతర సంబంధం అనే చర్చ కూడా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో నిజం ఇది అని చెప్పేలోపు అబద్దం వైరల్ అయిపోతుందని చెప్పొచ్చు.

ఆ సంగతి అలా ఉంటే... ఇక ఇటీవల సుమారు గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందనే సంగతి తెలిసిందే. సుమారు 10 రోజుల నుంచి ఎన్నో రకాల ట్విస్టులు, జలక్కుల మధ్య ఈ వ్యవహారం పీక్స్ కి చేరి, అనంతరం హైకోర్టు కు చేరి ప్రస్తుతం కాస్త అవుట్ ఆఫ్ ఫోకస్ అయినట్లు కనిపిస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో అనంతబాబు అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు. తనతో అత్యంత చనువుగా అనంత బాబు మాట్లాడారు అంటూ సదరు మహిళ ఆ వీడియోని మీడియాకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో ముద్దులు.. అంతకు మించిన వ్యవహారాలు కనిపిస్తున్న పరిస్థితి!

ఈ నేపథ్యంలో స్పందించిన టీడీపీ నేతలు.. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం మీడియాలో చర్చలు, బ్రేకింగ్ లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!