సలహాదారుల పోస్టులు ఉన్నట్టా.. లేనట్టా ..!
కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒకరిద్దరు సలహాదారులను మాత్రమే నియమించారు. వారు కూడా సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 6 March 2025 7:00 PM ISTకూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒకరిద్దరు సలహాదారులను మాత్రమే నియమించారు. వారు కూడా సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు. ఎక్కడా హడావుడి చేయడం లేదు. అయితే.. గతంలో వైసీపీ ప్రభు త్వం ఏకంగా 62 మంది సలహాదారులను నియమించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతల లెక్కల ప్రకారం .. ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంది. అయితే.. ఇప్పుడు అందులో సగమైనా తమకు ఇస్తారని చాలా మంది సీనియర్లు ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఇప్పటి వరకు ఇలాంటి దిశగా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మరోవైపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నా.. నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. పదవుల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. ఇటవల రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు ఈ విషయంపై దృష్టి పెట్టారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఒకరు సలహాదారుల పదవి విషయాన్ని ఆయన వద్ద చర్చించారు.
దీనిపై చంద్రబాబు .. ఆలోచిస్తున్నానంటూ సమాధానం ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సలహాదారుల కోసం పదవులు ఏర్పాటు చేస్తే.. ఇక్కడ కూడా కూటమి పార్టీల నుంచి పోటీ తథ్యం. సో.. దీనిని బట్టి .. 25 మంది నుంచి 30 మందిలోపు సలహాదారులను తీసుకునే అవకాశం ఉంటుందని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో 15 మందికి పైగానే .. టీడీపీ నుంచి ఉండే అవకాశం ఉంటుందని అంటున్నాయి.
అయితే.. చంద్రబాబు ఉద్దేశం వేరేగా ఉందని తెలుస్తోంది. గతంలో సలహాదారుల కారణంగా.. ప్రభుత్వా నికి మంచికన్నా చెడు ఎక్కువగా జరిగింది. దీంతో ఇప్పుడు తాము కూడా అదే బాటలో నడిస్తే.. ఇబ్బం దులు తప్పకపోవచ్చని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ సీనియర్ మోస్టులను సంతృప్తి పరిచేందుకు మరో ఒకటి రెండు మాసాల్లో ఈ విషయంపైనా పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటారని.. సీఎం కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుడు ఒకరు ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.