ఏపీ అసెంబ్లీ... మరీ అంత పలచగానా ?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. గత నెలలో మొదలైన ఈ సమవేశాలు మరి కొన్ని రోజుల పాటు సాగనున్నాయి.
By: Tupaki Desk | 12 March 2025 1:00 AM ISTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. గత నెలలో మొదలైన ఈ సమవేశాలు మరి కొన్ని రోజుల పాటు సాగనున్నాయి. అయితే కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఎలాంటి రాజకీయ హడావిడి లేకుండా సాగుతున్నాయి. సభలో అంతా కూటమి సభ్యులే ఉన్నారు. దీంతో చప్పగానే సమావేశాలు సాగిపోతున్నాయని అంటున్నారు.
విపక్షంలో ఉన్న వైసీపీ సభకు రావడం లేదు. విపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభకు దూరంగా ఉంటోంది. దాంతో సభా కార్యకలాపాలు అన్నీ అధికార పక్షం తోనే సాగుతున్నాయి. ఏకపక్షంగా సమావేశాలు జరిగిపోవడంతో ఎవరూ పెద్దగా ఈ సమావేశాల మీద ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.
ఇక విపక్షంలో ఉన్న వైసీపీ నుంచి 11 మంది సభ్యులు రావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ కూటమికి ఉన్న మొత్తం 164 మంది సభ్యులు కూడా అత్యధికులు సభకు గైర్ హాజరు అవుతున్నారంటే ఏ విధంగా చూడాలని అంటున్నారు.
సభలో ఎమ్మెల్యేల హాజరు బాగా తగ్గుతోందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసినా కూడా సభ వైపు చాలా మంది చూడడంలేదని అంటున్నారు. దాంతో సభలో పలచగా సభ్యులు కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఒక్కోసారి చూస్తే సభలో కనీసంగా అరవై మంది సభ్యులు కూడా ఉండడం లేదని అంటున్నారు.
నిజానికి పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయని ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు ఆయా పార్టీల అధినాయకత్వాలు కొంత రిలీఫ్ ఇచ్చాయి. బాగా పనిచేయాలని భారీ మెజారిటీతో అభ్యర్ధులను గెలిపించాలని కోరాయి. దాంతో చాలా మంది ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో పడ్డారు. అయితే ఆ ఎన్నికలు ముగిసాయి. కానీ సభకు మాత్రం చాలా మంది రావడం లేదు అని అంటున్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సభకు రావాలని పదే పదే కోరుతూ వస్తున్నారు. నిజానికి కూటమికి 164 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 60 మంది దాకా గైర్ హాజరు అయినా వంద మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలు సభలో ఉండాల్సి ఉంది. కానీ వందకు పైగా ఎమ్మెల్యేలు గైర్ హాజరు అవుతున్నారని అంటున్నారు. దాంతో సభలో సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోతోందని అంటున్నారు.
నిజానికి ఏడాదికి మూడు సార్లు సభ కచ్చితంగా సమావేశం అవుతుంది. అందులో బడ్జెట్ సెషన్ పెద్దదిగా ఉంటుంది. గతంలో అయితే నెలకు పైగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత ఆ రోజులను తగ్గిస్తూ వచ్చారు. ఇపుడు చూస్తే ఆ తగ్గించిన రోజులకు కూడా సభ్యులు హాజరు కాకపోతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
సభలో సభ్యులు అంతా ఉంటేనే ప్రజా సమస్యల ప్రస్తావన ఉంటుంది. ప్రతీ ఎమ్మెల్యేకు తన నియోజకవర్గం సమస్యలను చెప్పుకోవడానికి అసెంబ్లీ సరైన వేదికగా ఉంటోంది. ఇక ప్రతిపక్ష సభ్యులు సభకు హాజరైతే వారు ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశించేందుకు అవకాశం ఉంటుంది.
కానీ సభ్యులు గైర్ హాజరు కావడం వల్ల ప్రజలకే అన్యాయం జరుగుతోంది అని అంటున్నారు. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు ఏ రాజకీయ పార్టీ పన్నుతోంది అన్నది పక్కన పెడితే సభకు రావడం అన్నది చట్ట సభలకు ఎన్నికైన ప్రతీ సభ్యుడి విధిగా ఉంటోంది. కానీ చాలా మంది మాత్రం సభకు రావడం విషయంలో ఆలోచిస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ జరిగినన్నాళ్ళూ కచ్చితంగా సభ్యులు హాజరు కావాలని నిబంధనలు పెడితేనే తప్ప ఆశించిన ఫలితాలు రావేమో అని అంటున్నారు.