వాహనదారులకు బిగ్ అలర్ట్... నేటి నుంచి భారీగా ఫైన్స్!
ట్రాఫిక్ రూల్స్ పై అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంత్మంది వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 1 March 2025 3:56 AM GMTఎవరు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎలా చెప్పినా, ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది వాహనదారులు నిత్యం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంటారని అంటారు. పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటాన్ని పలువురు గొప్ప విషయంగా చెప్పుకుని వారి అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని బయటపెట్టుకుంటారని చెబుతుంటారు.
ప్రధనంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ లకు పాల్పడుతుంటారు. దీనివల్ల వారే కాకుండా ఇతరులను ఇబ్బందికి గురిచేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యింది!
అవును... ట్రాఫిక్ రూల్స్ పై అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంత్మంది వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా.. కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని అమలుచేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే వాహదారులకు బిగ్ అలర్ట్ అందించారు. ఇందులో భాగంగా... ఇకపై ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్ విధించనున్నారు. ఈ కొత్త యాక్ట్ ప్రకారం ఫైన్స్ భారీగా ఉండనున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో... హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా, సీటు బెల్ట్ లేకుండా కారు నడిపినా రూ.1,000 ఫైన్ విధించనున్నారు.
ఇదే సమయంలో... ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ వంటి వాటికి పాల్పడితే రూ.1,000 ఫైన్ విధించనున్నారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5,000 జరిమానా ఉంటుంది. ఇక ప్రధానంగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు తేలితే రూ.10,000 ఫైన్ తో విధించడంతోపాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.