Begin typing your search above and press return to search.

రూ.1000 కోట్ల ధనవంతులు... తెలుగు రాష్ట్రాల్లోని వారు వీరే!

తెలంగాణలో వీరి సంఖ్య 109 కాగా.. ఆంధ్రప్రదేశ్ లో వీరి సంఖ్య 9 మాత్రమే. ఏది ఏమైనా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 118 మంది ధనవంతులు ఉన్నారన్నమాట.

By:  Tupaki Desk   |   23 Feb 2025 5:10 AM GMT
రూ.1000 కోట్ల ధనవంతులు... తెలుగు రాష్ట్రాల్లోని వారు వీరే!
X

దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది రూ.1000 కోట్ల కంటే ఎక్కువ నికర నికర విలువ కలిగి ఉన్నారనేది ఆసక్తిగా మారింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

అవును... భారతదేశంలో రూ.1000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వారి జాబితా రాష్ట్రాల వారీగా తెరపైకి వచ్చింది. ఈ జాబితాలో దేశం మొత్తం మీద 1,539 మంది ఉండగా.. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 118 మంది ఉన్నారు. ఇక ఈ జాబితాలో దేశ వాణిజ్య రాజధాని ఉన్న మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది.

2020తో పోలిస్తే భారతదేశంలో ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలో 2020లో 247 మంది ధనవంతులతో ఉన్న మహారాష్ట్ర.. తాజాగా 470 మంది ధనవంతులతో దేశంలోనే ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. అంటే.. 2020 కంటే 223 మందితో భారీ పెరుగుదలను నమోదు చేసింది.

ఇక మహారాష్ట్ర తర్వాత 213 మంది ధనవంతులతో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. వాస్తవానికి 2020లో ఢిల్లీలో ధవంతుల సంఖ్య 128గా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్యను భారీగా పెంచుకుని.. మరోసారి రెండోస్థానంలో నిలిచింది. ఢిల్లీ తర్వాత జాబితాలో వరుసగా గుజరాత్ (129), తమిళనాడు (119) రాష్ట్రాలు నిలిచాయి.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. అంటే... ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ధన్వంతుల జాబితా ఘణనీయంగా పెరిగిందన్నమాట. అనంతరం.. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 109 మంది ధనవంతులతో నిలిచింది. 2020లో తెలంగాణలో 54 మంది ధనవంతులు ఉండేవారు.

అనంతరం... 2020లో 72 మంది ధనవంతులతో ఉన్న కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు 108 మంది ధనవంతులను కలిగి ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత వరుసగా... పశ్చిమ బెంగాల్ (70), హర్యానా (40), ఉత్తర ప్రదేశ్ (36), రాజస్థాన్ (28) మంది ధనవంతులు ఉన్నారు. ఇక ఏపీలో ధనవంతుల సంఖ్య 9 మంది మాత్రమే కావడం గమనార్హం.

ఇలా ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో వీరి సంఖ్య 109 కాగా.. ఆంధ్రప్రదేశ్ లో వీరి సంఖ్య 9 మాత్రమే. ఏది ఏమైనా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 118 మంది ధనవంతులు ఉన్నారన్నమాట.