Begin typing your search above and press return to search.

కూట‌మి స‌ర్కార్‌కు పెద్ద కుంప‌ట్లు... !

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వానికి సెగ త‌గులుతోంది. ఇది ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. వాస్త‌వం.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:11 PM GMT
కూట‌మి స‌ర్కార్‌కు పెద్ద కుంప‌ట్లు... !
X

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వానికి సెగ త‌గులుతోంది. ఇది ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. వాస్త‌వం. ముఖ్యం గా యువ‌త నుంచి భారీ వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. దానిని ఇప్ప‌టి వ‌ర‌కు నాన్చుతూనే ఉన్నారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించే విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. మ‌రోవైపు.. వారికి గ‌త నాలుగు మాసాలుగా జీతాలు కూడా రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.3 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్లు (రాజీనామా చేసిన 1.4 ల‌క్ష‌ల మంది కాకుండానే) ఆవేద‌న‌లో ఉన్నారు.

త‌మ‌కు ఉపాధి క‌ల్పిస్తారా? లేదా? అని వారు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. క‌లెక్ట‌రేట్ల ముందు ధ‌ర్నాలు కూడా చేస్తున్నారు. ఒక‌వైపు ఉద్యోగాల క‌ల్ప‌న అంటూనే మ‌రోవైపు ఉన్న ఉద్యోగాల‌ను తీసేయ‌డం ఏంట‌ని వారు నిల‌దీస్తున్నారు. దీనిపై స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. ఇక‌, ఇప్పుడు మ‌రో రెండు స‌మ‌స్య‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ నెల 12 నుంచి కొత్త మ‌ద్యం విధానం అందుబాటులోకి రానుంది. దీని ప్ర‌కారం.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు అధీనంలో ఉన్న వైన్స్ షాపుల‌ను ప్రైవేటుకు అప్ప‌గిస్తారు.

దీంతో గ‌త ఐదేళ్లుగా ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో ప‌నిచేస్తున్న 60 వేల మందికి పైగా యువ‌త భ‌విష్య‌త్తు పై ఇప్పుడు ప్ర‌శ్న‌లు అలుముకున్నాయి. త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ ఉద్యోగం, ఉపాధి చూపించాల‌ని వారు ప‌ట్టుబడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వాన్ని వారు ఒత్తిడి చేస్తున్నారు. కొత్త‌గా ఏర్పాటు చేసే ప్రైవేటు మ‌ద్యం దుకాణాల్లో త‌మ‌ను కొన‌సాగించేలా చూడాల‌ని వారు కోరుతున్నారు. కానీ, ఇది స‌ర్కారు చేతిలో ప‌ని కాదు. తాను కోరుకున్న వ్య‌క్తిని ప‌నికి నియోగించే అవ‌కాశం ప్రైవేటు వ్యాపారుల చేతిలోనే ఉంటుంది.

దీంతో సుమారు 60 వేల మందికి పైగా మ‌ద్యం దుకాణాల్లో సూప‌ర్ వైజ‌ర్లుగా చేసిన వారు, బాయ్‌లుగా ప‌ని చేసిన వారు కూడా ఉద్య‌మ బాట‌ప‌డుతున్నారు. ఇక‌, రెండో కీల‌క అంశం.. రేష‌న్ దుకాణాలు. ఇంటింటికీ పంపుతున్న రేష‌న్ వాహ‌నాల‌ను ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 67 వేల మంది డ్రైవ‌ర్లు, మ‌రో 67 వేల మందికి పైగా స‌హాయ‌కులు ఉన్నారు. ఇప్పుడు వాహ‌నాల‌ను ఎత్తేసి.. తిరిగి పాత ప‌ద్ధ‌తిలోనే రేష‌న్ దుకాణాల‌ను ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో త‌మ ప‌రిస్థితి ఏంటని వాహ‌నాల డ్రైవ‌ర్లు నిల‌దీస్తు న్నారు. మొత్తంగా చూస్తే.. కూట‌మి స‌ర్కారుకు న‌లుదిశ‌ల నుంచి సెగ త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం.