Begin typing your search above and press return to search.

రఘువీరా...వైఎస్ షర్మిల.. పదును తేరిన కాంగ్రెస్ ఏపీ పాలిటిక్స్

అలా కాంగ్రెస్ ఏపీ పాలిటిక్స్ లో తమ మార్క్ ని మళ్లీ క్రియేట్ చేసేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కి ఏపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాతిక ఎంపీ సీట్లు ఇక్కడ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   21 Aug 2023 3:50 AM GMT
రఘువీరా...వైఎస్ షర్మిల.. పదును తేరిన కాంగ్రెస్ ఏపీ పాలిటిక్స్
X

ఏపీలో కాంగ్రెస్ కి ఏముంది అన్న నిలువెత్తు ప్రశ్న ఇపుడు ఎదురుగా ఉంది. అయితే రాజకీయాల్లో ఉంది అనుకున్న వారికి అవి శాశ్వతం కాదు, లేదు అనుకున్న వారికి అవి రాకుండా పోవు. అందువల్ల కాంగ్రెస్ కి సంబంధించినంతవరకూ చూస్తే ఇది కచ్చితంగా కష్టకాలం. అందుకే కాంగ్రెస్ ఈ కష్టకాలాన్ని అధిగమించాలని చూస్తోంది. దాని కోసం తనదైన రాజకీయంతో ముందుకు సాగుతోంది.

అలా కాంగ్రెస్ ఏపీ పాలిటిక్స్ లో తమ మార్క్ ని మళ్లీ క్రియేట్ చేసేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కి ఏపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాతిక ఎంపీ సీట్లు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ కి బలంగా ఉన్నా అక్కడ అక్కడ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఎంపీ సీట్లు ఏపీలో ఉండడంతో కాంగ్రెస్ కి రిపేర్లు చేయాలన్నది ఆ పార్టీ ఆలోచన.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ రధాన్ని కదిలిస్తే మొత్తం 42 ఎంపీ సీట్లలో మెజారిటీ దక్కించుకుంటే కేంద్రంలో సులువుగా అధికాం దక్కుతుంది అన్నది కాంగ్రెస్ ఆలోచన. ఉత్తరాదిన బలనా బీజేపీ కమ్ముకున్న వేళ సౌత్ స్టేట్స్ లో ఉన్న 120 ఎంపీ సీట్లలో అత్యధిక శాతం అంటే వందకు పైగా ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకుంటే ప్రధాని కాంగ్రెస్ నుంచే వస్తారు అన్నదే ఆ పార్టీ ఎత్తుగడగా ఉంది.

అందువల్ల కాంగ్రెస్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎంతలా అంటే నాకొద్దీ రాజకీయం అని ఏంచక్కా వ్యవసాయం చేసుకుంటూ తన సొంత ఊరు ప్రజలు ఫ్యామిలీతో మనవళ్ళతో గడిపేస్తున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డిని తెచ్చి రీ యాక్టివేట్ చేసేంతలా. ఆ మధ్య రాహుల్ గాంధీ అనంతపురం మీదుగా భారత్ జోడో యాత్ర చేసినపుడు రఘువీరాను పిలిపించుకుని మంతనాలు జరిపారు.

ఆ తరువాత ఏమి జరిగిందో కానీ కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిశీలకుడిగా రఘువీరా పనిచేశారు. సీమ సరిహద్దులలో తెలుగు వారు ఉన్న చోట కాంగ్రెస్ ని గెలిపించే విషయంలో తన వంతు చేయి వేశారు. కాంగ్రెస్ కర్నాటకలో గెలిచింది. రఘువీరాకూ ఇపుడు గుర్తింపు వచ్చింది. ఆయన్ని తెచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక సీడబ్ల్యూసీ శాశ్వత మెంబర్ గా చోటు కల్పించారు.

అలా రఘువీరాకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర రాజనరసింహ, టి. సుబ్బరామిరెడ్డి, కె రాజుకు శాశ్వత ఆహ్వానితులుగా సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్‌ రెడ్డిను ఎంపిక చేశారు. అయినా సరే రఘువీరాకు ఉండే ప్రత్యేకతే వేరు అని కాంగ్రెస్ పెద్దలు చాటి చెప్పారు.

ఏపీ పీసీసీ చీఫ్ గా పనిచేసిన రఘువీరా మంత్రిగా అనేక కీలక శాఖలు చూసారు. ఒక దశలో సీఎం రేసులో కూడా ఉన్నారు. ఇక రాయలసీమకు చెందిన కీలక నేత. కాంగ్రెస్ కి నమ్మిన బంటు. అలా కాంగ్రెస్ తనకు ఒకనాడు హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమ నుంచే పార్టీకి పైకిలేపాలని చూస్తోంది అంటున్నారు.

అందుకే రఘువీరాను తెచ్చి పెట్టారు. పైగా రఘువీరా వైఎస్సార్ కి ఆప్త మిత్రుడు. అత్యంత సన్నిహితుడు. దాంతో అలా ఆ వైపు నుంచి కూడా నరుక్కురావాలని చూస్తోంది. ఇక ఇంకో వైపు వైఎస్సార్ బ్లడ్ అయిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుని ఏపీ రాజకీయ బరిలో దింపాలని అనుకుంటోంది. ఈ ఇద్దరినీ ముందు పెట్టి గ్రేటర్ రాయలసీమలో హస్త రేఖలు సరిచేయాలన్నదే కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.

ఆ మీదట గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజికవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, ఇక బిగ్ షాట్ సుబ్బరామిరెడ్డి, బడుగు వర్గాల నుంచి కె రాజు ఇలా చాలా మందికి పదవులు ఇస్తూ కాంగ్రెస్ ఏపీ రాజకీయానికి పదును పెడుతోంది. తన ఓటు బ్యాంక్ ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆలోచన. వైసీపీ మీదకు డైరెక్ట్ ఫైట్ కోసమే ఇదంతా. ఈ ఎన్నికల వరకూ వైసీపీని ఓడించాలన్నదే అజెండా. మొత్తంగా కాంగ్రెస్ ఆలోచనలు ఇలా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏపీ మీద మరెంతగా ఫోకస్ ఉంటుందో చూడాల్సిందే.