జీఎస్టీ వసూళ్ళలో ఆంధ్రాదే టాప్ పొజిషన్
ఏ రాష్ట్రం అభివృద్ధిని అయినా కొలిచే కొలమానం ఆర్ధిక పరిపుష్టి మాత్రమే.
By: Tupaki Desk | 5 Nov 2023 9:38 AM GMTఏ రాష్ట్రం అభివృద్ధిని అయినా కొలిచే కొలమానం ఆర్ధిక పరిపుష్టి మాత్రమే. ఆదాయం బాగా వస్తే ఆ స్టేట్ బాగుంది అని అంటారు. విభజన జరిగి తొమ్మిదిన్నర ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏపీకి ఆదాయ వనరులు ఇంకా సమకూరడంలేదు అన్న మాట ఒక వైపు ఉంది. అదే సమయంలో పాలకుడు సమర్ధుడై సరైన నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా ఆర్ధిక ప్రగతి పరుగులు తీస్తుంది అని కూడా చెప్పాలి.
దానికి అచ్చమైన ఉదాహరణ ఏపీ సీఎం జగన్ సమర్ధ నాయకత్వం అని అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కో రంగాన్ని సుస్థిరం చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఏపీని ఆయన ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నారు. నిజానికి ఏపీకి విభజన సమస్యలకు తోడు కరోనా వంటి ప్రపంచ విపత్తి కూడా భారీగా దెబ్బ కొట్టింది. అయినా సరే జగన్ నాయకత్వంలో ఏపీ తేరుకుని ఇపుడు ప్రగతి దిశగా ముందుకు సాగుతోంది అనడానికి తాజా జీఎస్టీ వసూళ్లే నిదర్శనం అని అంటున్నారు.
ఏపీ జీఎస్టీ వసూళ్ళలో 12 శాతం వృద్ధి రేటుతో మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉండడం శుభ పరిణామం అని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక, ఆంధ్రా మాత్రమే 12 శాతం దాకా వృద్ధి సాధించి జీఎస్టీ వసూళ్ళలో పరుగులు పెట్టించాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు అక్టోబర్ 2023 వరకొ జీఎస్టీ వసూళ్ళ వృద్ధి చూస్త్తే దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటకతో సమనంగా ఏపీ నిలిచి ఉంది.
ఇది రాష్ట్ర విభజన తరువాత ఏపీ సాధించిన అద్భుతమైన విజయం అని అంటున్నారు. ఇక తెలంగాణా చూస్తే పది శాతం, తమిళనాడు తొమ్మిది శాతం, కేరళ అయిదు శాతం వృద్ధి రేటుని నమోదు చేయడం గమనార్హం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాపర వాణిజ్య పారిశ్రామిక విధానాలు అని అంటున్నారు.
వాటి ఫలితాలు ఇపుడు ఇలా వృద్ధి రేటులో కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏపీలో సులభతరమైన వాణిజ్య విధానాలు అమలు చేయడంతో పాటు దేశ, విదేశీయ పెట్టుబడులను ఆకట్టుకోవడంలోనూ గొప్ప ప్రగతి సాధించినట్లుగా కూడా కేంద్ర నివేదికలు ఇప్పటికే స్పష్టం చేసాయి.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.1,72,003 కోట్లుగా ఉంది. మొత్తంలో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.91,315 కోట్లు అంటే
వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,127 కోట్లతో కలిపి ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు (రూ. 1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.
ఇలా గణాంకాలు అన్నీ చూసుకుంటే ఏపీ అన్ని విధాలుగా పన్నుల ఆదాయంలో వేగంగా ప్రగతి సాధించి ముందుకు దూసుకుపోతోందని చెప్పాలి. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం దేనికి ఏది అవసరంలో చూసుకుంటూ దానికి తగిన విధంగా వ్యవహరించడం, తొందరగా నిర్ణయాలు తీసుకోవడం కూడా మరో కారణం అంటున్నారు.
పారిశ్రామికవేత్తలకు ఏపీలో మంచి వాతావరణం ఉందని అంటున్నారు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఏపీ పెట్టుబడులకు అనుకూలం అని చెప్పడం ద్వారా కూడా రాష్ట్రం గడచిన కాలంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కారణం అయింది అంటున్నారు. వాటి ఫలితంగా ఇపుడు పన్నులు అధికంగా వసూల్ అవుతున్నాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే అక్టోబర్ జీఎస్టీ వసూళ్ళు ప్రభుత్వ సమర్ధతను చాటి చెప్పడమే కాకుండా ఏపీ భవిష్యత్తు మీద కూడా కొండంత భరోసాను ఇస్తున్నాయని కచ్చితంగా చెప్పాల్సి ఉంది.