Begin typing your search above and press return to search.

పచ్చ మీడియా అధిపతికి ఏమైంది... కూటమిని కెలుకుడేంది ?

మరి ఆ పచ్చ మీడియాలోని ఒక పచ్చ పత్రిక అధినేత అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మీద యాంటీగా వార్తలు రాస్తున్నారు నిజంగా చూస్తే ఇది షాకింగ్ పరిణామమే.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:59 PM GMT
పచ్చ మీడియా అధిపతికి ఏమైంది... కూటమిని కెలుకుడేంది ?
X

రెండు తెలుగు రాష్ట్రాలకు పచ్చ పత్రికలు పచ్చ చానళ్ళు ఏమిటి అన్నది పేర్లు చెప్పకపోయినా ఒక ఐడియా మాత్రం స్పష్టంగా ఉంది. పచ్చ పత్రికలు పచ్చ చానళ్ళు పూనకం వచ్చినట్లుగా ఒక పార్టీని కొమ్ము కాయడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. దానికి తగిన విధంగా వారు ఏదో తెర వెనక ప్రయోజనం పొందుతున్నారు అని వైసీపీ నేతలు విమర్శిస్తూంటారు. వైసీపీ అధినాయకత్వం అయితే పేర్లు పెట్టి మరీ పచ్చ మీడియాను విమర్శించేది. దోచుకో దాచుకో పంచుకో అంటూ జగన్ కూడా పచ్చ మీడియా మీద విమర్శలు చేసేవారు.

ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి పచ్చ మీడియా ఎంతగానో కృషి చేసింది. ఆఖరుకు చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న అంశాన్ని జనంలో పెట్టి మరీ వైసీపీ నడ్డిని విరిచింది. అలా సెంటిమెంట్ తో కొట్టడంలో పచ్చ మీడియా అత్యంత కీలకమైన భూమిక పోషించింది.

మరి ఆ పచ్చ మీడియాలోని ఒక పచ్చ పత్రిక అధినేత అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మీద యాంటీగా వార్తలు రాస్తున్నారు నిజంగా చూస్తే ఇది షాకింగ్ పరిణామమే. ఎందుకంటే ఎపుడూ చేయని పని. గతంలో కూడా జరగలేదు. మరి ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అన్నదే ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

ఎంతసేపూ టీడీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకుని రావడమే పనిగా పెట్టుకునే పచ్చ మీడియాలో అత్యత ముఖ్యుడు అగ్ర తాంబూలం లాంటి ఆ అధిపతి ఎందుకు కూటమిని కెలుకుతున్నారు అన్నదే ఎవరికీ అంతు పట్టడం లేదు. ఎక్కడ తేడా వచ్చింది అన్నది కూడా తెలియడంలేదు అని అంటున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆ అధిపతి ఆశించినది జరగలేదా లేదా ఆయన అంత సంతృప్తిగా లేరా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరి ఏమైందో తెలియదు కానీ ప్రతీ రెండు మూడు రోజులకు ఒక మారు టీడీపీ కూటమి ప్రభుత్వానికి యాంటీగా పచ్చ పత్రికలోనూ ఆయన పచ్చ మీడియాలోనూ యాంటీ వార్తలు వస్తున్నాయి. దీంతో ఏదో తేడాగా ఉంది ఎక్కడో చెడింది అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.

నిజానికి చూస్తే తెలుగు మీడియాలో దిగ్గజ మన దగిన వారు గతించారు. ఇపుడు ఆ ప్లేస్ లోకి రావాలని ఆయన భావిస్తున్నారా ఆయనకు ప్రభుత్వం ఆ మేరకు గౌరవం ఇవ్వాలను ఆశిస్తున్నారా అన్నది అయితే అర్థం కావడం లేదు అంటున్నారు. గతంలో ఎవరికీ ఈయని మర్యాద గౌరవం ఒక దిగ్గజ మీడియా అధిపతికి దక్కాయి.

అయితే ఇపుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. అలాగే మీడియా అన్నది ప్రభుత్వం తప్పు ఒప్పులను నిలదీసి సరైన మార్గంలో నడిపించాలి. కానీ దశాబ్దాలుగా చూస్తే అలాంటి వాతావరణం లేకుండా పోయింది. వారి కొమ్ము కాస్తూ తమకు అనుకూలంగా చేసుకోవడమే నయా నీతిగా మారింది. మరి ఇందులో కూడా ఇపుడు ఒకరిద్దరు కాదు చాలా మంది చేరారు. దాంతో పోటీ పెరిగింది.

గతంలో అయితే ఒకరిద్దరి మీదనే ఆధారపడే పరిస్థితి ఉండేది. ఇపుడు అనేక మంది మీడియా అధిపతులు పచ్చ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. దాంతో జూనియర్ సీనియర్ అన్న తేడా కూడా వస్తోంది. తమను పక్కన పెట్టి వారిని సమాదరిస్తున్నపుడు సహజంగాన పాతవారికి మండుతుంది. అలా దశాబ్దాలుగా మీడియా ప్రపంచంలో పెనవేసుకుని పోయి తనకంటూ ఒక బ్రాండ్ సాధించుకున్న ఆ పచ్చ మీడియా అధిపతికి ఇపుడు కూటమితో నిజంగా చెండిదా అని చర్చించుకుంటున్నారు. మరి ఇది టీ కప్పులో తుఫానుగా ముగుస్తుందా లేక తెగే దాకా సాగుతుందా అన్నదే చూడాల్సి ఉంది.

అయితే ఇపుడు టీడీపీలోనూ అనేక పరిణామాలు సంభవించాయి. అక్కడ కూడా కొత్త అధికార కేంద్రం ఉంది. దాంతో గతానికి ఇప్పటికీ తేడా వస్తోంది అని అంటున్నారు. బహుశా ఇలాంటి పరిణామాలే పచ్చ మీడియా పెద్ద మనిషిని బాధించి ఉంటాయని గుసగుసలు పోతున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట. పైసా మే పరమాత్మ హై. ఎవరు ఎన్ని రకాలుగా లెక్కలు వేసుకున్నా నీది తెనాలీ నాది తెనాలీ అని రాసుకుని పూసుకున్నా చివరికి తేడా చేసేది చెడగొట్టి విడగొట్టేది పైసాయే అని అంటున్నారు. సో ఏపీ రాజకీయాల్లో ఈ పచ్చ మీడియా స్వపక్షంలో విపక్షం మాదిరిగా రాస్తున్న రాతలు మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నరుట. అదీ మ్యాటర్.