Begin typing your search above and press return to search.

బీజేపీని జనాలు నమ్ముతారా ?

రెండురోజుల క్రితం బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:01 AM GMT
బీజేపీని జనాలు నమ్ముతారా ?
X

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బీజేపీ నేతలు కొత్తడ్రామాలు మొదలుపెట్టారు. అయితే జనాలు నమ్ముతారా ? ఇదంతా ఏ విషయంలో అంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలోనే. రెండురోజుల క్రితం బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు చెప్పారు. నిలిచిపోయిందని చెప్పారే కానీ ఆగిపోయిందని కాని లేదా ప్రభుత్వ రంగ సంస్ధగానే కంటిన్యు అవుతుందని కానీ చెప్పలేదు.

ఇక ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్స్ గురించి ఏమిచెప్పినా చెప్పాల్సింది కేంద్రప్రభుత్వమే కానీ జీవీఎల్ కానేకాదు. ఎందుకంటే జీవీఎల్ కేవలం ఒక ఎంపీ మాత్రమే. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంలో ఎంపీ మాట ఎందుకు పనికిరాదు. రేపు ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యంలో ఉన్నారు కాబట్టి జీవీఎల్ విశాఖలో తిరుగుతున్నారు. ఎన్నికల్లో పోటీచేయకపోయినా లేదా ఓడిపోయినా మళ్ళీ వైజాగ్ మొహం కూడా చూడరు.

ఇపుడు విషయం ఏమిటంటే ప్రైవేటీకరణ విషయమై ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, జనాలు ఎన్నో ఆందోళనలు చేశారు. అప్పట్లో ఎందులోను బీజేపీ నేతలు పార్టిసిపేట్ చేయలేదు. పాల్గొనకపోతే ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటం ఆగదని రెచ్చగొట్టేట్లుగా మాట్లాడారు. వాటిని జనాలు ఎలా మరచిపోతారు ? స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రజాసంఘాలు ఎన్ని మీటింగులు పెట్టినా బీజేపీ నేతలు ఒక్క సమావేశంలో కూడా పాల్గొనలేదు. సమావేశంలో పాల్గొనకపోగా ఇలాంటి సమావేశాలు నిర్వహించటం దండగంటు చెప్పారు.

వైజాగ్ లో పర్యటించిన కేంద్రమంత్రులు కూడా ప్రైవేటీకరణ ఆగదని పదేపదే చెప్పారు. అలాంటిది ఇపుడు సడెన్ గా ప్రైవేటీకరణ నిలిచిపోయిందని జీవీఎల్ చెప్పటంలో అచ్చంగా రాజకీయమే జనాలకు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్న తనకు జనాలు ఓట్లేయరనే భయం ఎంపీలో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే నోటికొచ్చినట్లు ఏదేదో చెప్పేస్తున్నారు.

జీవీఎల్ ఏమిచెప్పినా వైజాగ్ జనాలు బీజేపీని నమ్మే అవకాశం చాలా చాలా తక్కువనే అనుకోవాలి. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన దగ్గుబాటి పురందేశ్వరికి 33 వేల ఓట్లొచ్చాయి. అంటే డిపాజిట్ కూడా దక్కలేదు. మరి రాబోయే ఎన్నికల్లో జీవీఎల్ పరిస్ధితి ఏమిటో చూడాలి.