Begin typing your search above and press return to search.

ఏపీకి మరో కొత్త రాజధాని!

ఈ సమయంలో... వైవీ సుబ్బరెడ్డి స్పందిస్తూ హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా పొడిగించేలా పార్లమెంట్ లో పోరాడతామని అన్నారు

By:  Tupaki Desk   |   16 Feb 2024 10:41 AM GMT
ఏపీకి మరో కొత్త రాజధాని!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజాధాని అంశం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అమరావతి పేరు చెప్పి కనీవినీ ఎరుగని అవినీతికి పాల్పడిందని.. జనాలకు గ్రాఫిక్స్ చూపించిందని.. అధికార వైసీపీ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాల అభివృద్ధినీ, ఆకాంక్షనూ దృష్టిలో పెట్టుకుని అంటూ మూడు రాజధానుల ప్రకటన తెరపైకి తెచ్చింది.

ఈ సమయంలో... వైవీ సుబ్బరెడ్డి స్పందిస్తూ హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా పొడిగించేలా పార్లమెంట్ లో పోరాడతామని అన్నారు. దీంతో ఒక్కసారిగా పెను దుమారం లేచింది. దీంతో ఏపీపీసీసీ చీఫ్ షర్మిళ... అధికార వైసీపీని, ప్రతిపక్షం టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒకరు 3డీ గ్రాఫిక్స్ చూపిస్తే, మరొకరు మూడు ముక్కలాట ఆడారు అంటూ ఫైరయ్యారు. ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే... ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా? అంటూ ఫైరయ్యారు.

ఇలా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఇది కూడా ఒక కీలక అంశం కాబోతుంది. ఈ సమయంలో ఇవి చాలవన్నట్లు కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా తిరుపతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా తిరుపతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్‌. ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... తిరుపతి రాజధానిపై ప్రజాఉద్యమం ప్రారంభం అవుతోందని అన్నారు. ఈ క్రమంలో ఎంతమంది అడ్డోచ్చినా... తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరుపతిని రాజధానిని చేసి తీరుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా మరిన్ని హామీలు ఇచ్చారు చింతా మోహన్‌!

ఇందులో భాగంగా... నిరుపేద వర్గాల అప్పుల మాఫీ హామీని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడతామని తెలిపిన చింతా మోహన్... తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ అప్పులను మాఫీ చేసేస్తామని అన్నారు! అనంతరం... ప్రజల ఇబ్బందులు చంద్రబాబు, వైఎస్‌ జగన్ లకు కనపడటం లేదంటూ ఫైరయ్యారు. ఏది ఏమైనా... ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల చర్చతో పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపు చర్చలు నడుస్తున్న నేపథ్యంలో... ఏపీ రాజధానిగా తిరుపతి అంటూ చింతా మోహన్ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది!