మార్పు మంచిదే.. కానీ, మరకలు పడుతున్నాయే..!
ఏపీ అధికార పార్టీకి కొత్త జిల్లాల ఎఫెక్ట్ బాగానే తగులుతోందని అంటున్నారు పరిశీలకులు
By: Tupaki Desk | 16 Jan 2024 11:30 AM GMTఏపీ అధికార పార్టీకి కొత్త జిల్లాల ఎఫెక్ట్ బాగానే తగులుతోందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నిక ల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రభావం కొంత ప్లస్ అయితే.. మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంద ని చెబుతున్నారు. 2021లో వైసీపీ సర్కారు అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా జిల్లాలను ఏర్పా టు చేసింది. ఇది రాజకీయంగాను.. సామాజికంగానూ.. మేలు చేస్తుందని లెక్కలు వేసుకుంది. ఈ క్రమం లోనే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలుగా మారింది.
ఇంత వరకుబాగానే ఉంది. అయితే.. జిల్లా కేంద్రాల ఏర్పాటు, జిల్లాలకు కొత్త పేర్లు పెట్టే విషయంలో అనేక ఇబ్బందులు తెరమీదికి వచ్చాయి. కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన కేంద్రాలపై వివాదాలు .. రాజకీ యంగా కూడా వైసీపీకి ఇబ్బందిగా మారాయి. మరికొన్ని చోట్ల పేర్ల విషయంలోనూ వివాదం ఏర్పడింది. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణాజిల్లాను విభజించి.. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టారు. కానీ, వాస్తవానికి.. ఎన్టీఆర్ పుట్టింది.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు.
ప్రస్తుతం ఈ నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఇది కృష్ణాజిల్లాలో ఉంది. దీంతో ఈ జిల్లా పేరు మార్చి.. దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలనేది డిమాండ్. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పేరును కృష్ణాగా మార్చాలన్న డిమాండ్ ఉంది. ఇక, గుంటూరులో కూడా ఈ పేర్ల డిమాండ్లు ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు చిత్తూరులో జిల్లాలను విభజించి.. కొన్ని కడపలో చేరుస్తూ.. రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు.
కానీ, ఇక్కడివారు మరో జిల్లాను కోరుతున్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను మరింతగా విభజించి.. మరో జిల్లా ఏర్పాటుకు అక్కడి గిరిజనులు ఇప్పటికీ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ ఆది నుంచి బలంగా ఉంది. మొత్తంగా చూస్తే.. ఐదు నుంచి 8 జిల్లాల్లో అనేక డిమాండ్లు తెరమీదే ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు వైసీపీ ఉత్సాహం చూపించడం లేదు. కానీ, టీడీపీ మాత్రం తాము అధికారంలోకి రాగానే ఆయా డిమాండ్లు పరిష్కరిస్తామని చెబుతుండడంతో ఎన్నికల సమయంలో జిల్లాల మార్పులు ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.