ప్రభుత్వం టార్గెట్ రీచవుతుందా ?
మొత్తానికి ప్రభుత్వం ఎన్ని ఇళ్ళని టార్గెట్ పెట్టుకున్నా ఎన్ని పూర్తిచేసినా అంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 8 Sep 2023 5:06 AM GMTతాను పెట్టుకున్న టార్గెట్ ను ప్రభుత్వం రీచవుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే జనవరి నెలలోపు 5 లక్షల పక్కా ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఇందులో భాగంగానే గృహనిర్మాణ శాఖపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే 5 లక్షల ఇళ్ళు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. లండన్ పర్యటన నుండి తిరిగి రాగానే నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ళ ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు అధికారవర్గాలు చెప్పాయి.
ఆ తర్వాత మరో 5 లక్షల ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేయాలని జగన్ ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేశారు. నిర్మాణాలు జరుగుతున్న విధానంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు వచ్చేలోగా మొత్తంమీద 20 లక్షల ఇళ్ళని నిర్మించి లబ్దిదారులకు అందించాలన్నది ప్రభుత్వం టార్గెట్. రోజుకు 2 వేల ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేయాలని జగన్ పదేపదే సంబంధిత ఉన్నతాధికారులకు గుర్తుచేస్తున్నారు.
జనవరికి పెట్టుకున్న ఇళ్ళ నిర్మాణంలో బేస్ మెంట్ లెవల్లో సుమారు 4 లక్షల ఇళ్ళున్నాయి. రూఫ్ లెవల్లో లక్ష ఇళ్ళున్నాయి. ఆర్సి లెవల్లో మరో 45 వేల ఇళ్ళనిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ మూడు క్యాటగిరిల్లోని నిర్మాణాలను పూర్తిచేసి జనవరికి 5 లక్షల ఇళ్ళు పూర్తవ్వాలన్నది జగన్ టార్గెట్.
కోర్టు కేసులతో పాటు ఇతరత్రా కారణాలతో ఆడిపోయిన నిర్మాణాలను కూడా పట్టాలెక్కించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విజయనగరం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో ఇళ్ళనిర్మాణాలు జోరుగా పరిగెడుతోంది.
విజయనగరం జిల్లాకు 75 వేల ఇళ్ళు మంజూరైతే ఇప్పటికే 36 వేల ఇళ్ళనిర్మాణాలు పూర్తయ్యాయి. ఏలూరు జిల్లాలో 98 వేల ఇళ్ళు మంజూరైతే 28 వేలు పూర్తియపోయాయి. నంద్యాల జిల్లాకు 53 వేల ఇళ్ళు అలాట్ అయితే ఇప్పటికే 23 వేలు పూర్తయ్యాయి. వైఎస్సార్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా ఇళ్ళ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి.
మొత్తానికి ప్రభుత్వం ఎన్ని ఇళ్ళని టార్గెట్ పెట్టుకున్నా ఎన్ని పూర్తిచేసినా అంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది అందరికీ తెలిసిందే. ఇళ్ళని పూర్తిచేసి లబ్దిదారులకు అందించటం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందాలన్నది జగన్ అంతమ నిర్ణయం. మరి టార్గెట్ రీచవుతుందో లేదో చూడాలి.